కొత్త రూల్ : మీ ఇంట్లో కుక్కలు ఉంటే రూ.10 వేలు కట్టండి

కొత్త రూల్ : మీ ఇంట్లో కుక్కలు ఉంటే రూ.10 వేలు కట్టండి

అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో పెంపుడు జంతువులను ఉంచడానికి రూ. 10 వేలు వసూలు చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న  రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ నిబంధనను తప్పనిసరి చేసింది.  అపార్ట్‌మెంట్ లో  పెంపుడు జంతువులకు అనుమతి లేదని,  ఒకవేళ తప్పనిసరి అయితే  యజమాని రూ.  10 వేలు కట్టి రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలనే నిబంధనను తీసుకువచ్చింది.  

దాదాపు 1,000 ఫ్లాట్‌లతో ఎలక్ట్రానిక్స్ సిటీ ఫేజ్ 1లోని నీలాద్రి నగర్‌లోని ఇట్టినా మహావీర్ అనే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో పెంపుడు జంతువులను కలిగి ఉన్న 100 మంది నివాసితులు ఉన్నారు. పెంపుడు జంతువులున్న యజమానులంతా 2023 నవంబర్ 15 లోపు రూ.10 వేలు చెల్లించాలని  లేకపోతే రోజుకు అదనంగా రూ. 100 వసూలు చేస్తున్నారు.  దీనిపై నెటిజన్లు స్పందిస్తూ..  ఇటీవల అపార్ట్‌మెంట్ లలో పెంపుడు జంతువుల దాడి పెరగడంతో ఈ నిబంధనలు తీసుకువచ్చారు కావచ్చు అని అంటున్నారు.  

ALSO READ :-పండగ చేసుకోండి : ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఫ్రీ వైఫై