కుక్కలపై కంప్లైంట్ చేసినందుకు కొట్టి చంపిన్రు

బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోలదేవనహళ్లిలోని గణపతినగర్‌లో తన ఇంటి ముందు కుక్కల బెడదపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు 68 ఏళ్ల వ్యక్తిని  కొట్టి చంపారు. మృతుడు మునిరాజుగా గుర్తించిన పోలీసులు.. తన తండ్రిని రక్షించడానికి వచ్చిన మునిరాజు కుమారుడు మురళి (32)ని కూడా కొట్టారని చెప్పారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ప్రమోద్ ఎన్.బిన్ నరసింహమూర్తి(27) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏప్రిల్ 8న ఏం జరిగింది?

బెంగుళూరులో ఏప్రిల్ 8న మధ్యాహ్నం 1 గంటలకు జరిగిన ఈ ఘటనలో అరెస్టయిన నరసింహమూర్తి.. ఎప్పుడూ తన పెంపుడు కుక్కను మునిరాజు ఇంటిముందుకు తీసుకెళ్లి, కుక్కలతో మలమూత్రం చేయడం, తాను ధూమపానం చేయడం చేస్తుండేవాడని దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే ఓ రోజు అదే విషయంపై వారిద్దరూ గొడవ పడ్డారు. అంతలోనే పక్కనే ఉన్న దుకాణంలోని క్రికెట్ బ్యాట్‌తో ప్రమోద్ మునిరాజును నరసింహమూర్తి గట్టిగా కొట్టడంతో వాగ్వాదం తీవ్ర మలుపు తిరిగింది. ఇలా ప్రమోద్ మునిరాజును ఇంతకుముందు చాలాసార్లు కొట్టాడని, ఇప్పుడు అది అతని మరణానికి దారితీసిందని మునిరాజు కుటుంబసభ్యులు ఆరోపించారు.