హైదరాబాద్ లో డ్రగ్స్, గంజాయి కలకలం రేపుతోంది. ఈ మధ్య ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు డ్రగ్స్ ను సైడ్ బిజినెస్ గా చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే అడ్డాగా డ్రగ్స్ దందా చేస్తున్నారు. లేటెస్ట్ గా గచ్చిబౌలిలో గంజాయి అమ్ముతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గరి నుంచి కేజీ పొడి గంజాయి,175 గ్రాముల OG కుష్(అధిక నాణ్యత గల గంజాయి),ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శివరామ్ (28) బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. బెంగళూరులోని డెలాయట్ క్యాంపస్ లో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు. బెంగళూరులో అజయ్ అనే వ్యక్తి దగ్గరి నుంచి ఒక గ్రామ్ డ్రగ్స్ ను రూ. 1500కు కొనుగోలు చేసి హైదరాబాదులో ఒక గ్రామ్ రూ. 3000 రూపాయలకు అమ్ముతున్నాడు.
Also Read :- హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
ప్రతి వారం హైదరాబాద్ కు ట్రావెల్ బస్సుల్లో వచ్చి అవసరమైన కస్టమర్స్ గంజాయి అమ్ముతున్నాడు. ఈ విషయం తెలిసిన శంషాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్(DTF) పోలీసులు పక్కా ప్లాన్ తో డ్రగ్స్ అమ్ముతుండగా శివరామ్ ను పట్టుకున్నారు. రాయదుర్గం, గచ్చిబౌలి, ప్రశాంతి హిల్స్ ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. పట్టుబడ్డ మొత్తం గంజాయి విలువ రూ. లక్షా 91 వేలు ఉంటుందని తెలిపారు పోలీసులు. నిందితుడు శివరామ్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.అజయ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని..అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.