
- ఆపై ఆత్మహత్యా యత్నం చేసిన నిందితుడు
- బెంగళూరులో దారుణం.. పోలీసుల అదుపులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్
బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. ఆపై ఆమె డెడ్ బాడీని ముక్కలుగా చేసి, సూట్‌కేస్‌లో దాచిపెట్టాడు. అనంతరం నిందితుడు కూడా సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఈ ఘటన హులిమావు ఏరియాలోని దొడ్డకన్నహళ్లిలో బుధవారం జరిగింది. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ రాజేంద్ర ఖేడేకర్(36), గౌరీ అనిల్ సాంబేకర్(32) భార్యాభర్తలు. ఈ జంట ఏడాది కాలం
బుధవారం రాత్రి భోజనం చేస్తుండగా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అదికాస్త తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఈ గొడవతో తీవ్ర కోపోద్రిక్తురాలైన గౌరీ..రాకేశ్ పైకి కత్తిని విసిరింది. దీనికి ప్రతీకారంగా రాకేశ్.. అదే కత్తితో ఆమె మెడ, పొట్టపై అనేకసార్లు కత్తితో పొడిచాడు. దాంతో గౌరీ అక్కడికక్కడే మృతిచెందింది. గౌరీ చనిపోయిందని నిర్ధారించుకున్న రాకేశ్..ఆమె డెడ్ బాడీని 10 ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో కుక్కాడు. దాన్ని వాష్‌రూమ్‌లో దాచాడు.
అనంతరం గౌరి తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిందంతా వివరించాడు. ఆ తర్వాత తన కారులోనే మహారాష్ట్రలోని పుణెకు పారిపోయాడు. గురువారం సతారా జిల్లా షిర్వాల్ ఏరియాలో విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించారు.
ఫోన్ ద్వారా రాకేశ్ లొకేషన్ ను గుర్తించిన బెంగళూరు పోలీసులు.. మహారాష్ట్ర పోలీసుల సహాయంతో అతన్ని అరెస్ట్ చేశారు. గౌరీ హత్యకు కచ్చితమైన కారణం తెలుసుకోవడానికి రాకేశ్ ను బెంగళూరుకు తీసుకొచ్చారు. అయితే, కుటుంబ కలహాలే హత్యకు దారితీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.