
కలికాలం బాస్ కలికాలం.. గతంలో భర్తల వేధింపులపై భార్యలు కంప్లయింట్ చేసేశారు.. ఇప్పుడు భార్యల వేధింపులు తట్టుకోలేక భర్తలు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. మరికొందరు పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారు.. ఇటీవల కాలంలో బీభత్సంగా పెరిగిన భార్యా వేధింపుల బాధితుల్లో మరో భర్త చేశాడు. కర్నాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన శ్రీకాంత్.. వ్యాళికల్ పోలీస్ స్టేషన్ లో చేసిన కంప్లయింట్ ఆధారంగా అతని ధీన కథ ఇలా ఉంది..
నా భార్య పేరు బిందు.. 2022లో పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఆ తర్వాత నుంచి నా బాధలు వర్ణనాతీతం అంటూ ఏడుస్తున్నాడు ఆ భర్త శ్రీకాంత్. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న నేను.. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోం అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇంట్లో ఉండే పని చేస్తున్నాను. ఆ సమయంలో నా భార్య బిందు వేధింపులు అధికం అయ్యాయి అంటున్నాడు శ్రీకాంత్. ఆన్ లైన్ లో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న సమయంలో పెద్ద పెద్ద సౌండ్ తో పాటలు పెట్టటం, డాన్సులు చేయటం వంటివి చేస్తూ.. నన్ను మానసికంగా వేధించిందని చెబుతున్నాడు శ్రీకాంత్. దాని వల్ల ఉద్యోగంపై శ్రద్ధ పెట్టలేక ఉద్యోగం కూడా పోయిందని కన్నీటి పర్యంతం అవుతున్నాడు.
రోజుకు 5 వేల రూపాయలు, నెలకు లక్షా 50 వేల రూపాయలు ఇవ్వాలంటూ వేధించుకు తినేదని.. డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో చిత్రహింసలు పెట్టేదని చెబుతున్నాడు భర్త శ్రీకాంత్.
60 ఏళ్ల వరకు పిల్లలను కనను అంటోందని.. అంతగా పిల్లలు కావాలంటే ఎవర్నయినా దత్తత తీసుకుని నువ్వే పెంచుకో అంటూ భార్య బిందు చెబుతోందని.. 2022లో పెళ్లయినా.. ఇప్పటి వరకు పిల్లలు లేకపోవటానికి కారణం ఇదే అంటూ తన పోలీస్ కంప్లయింట్ లో వెల్లడించారు భర్త శ్రీకాంత్.
తన భార్య బిందు.. నాతో సూసైడ్ నోట్ కూడా రాయించిందని.. నా చావుకు నా భార్య, వారి కుటుంబ సభ్యులు కారణం కాదు.. నా అనారోగ్య సమస్యలు, ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ నాతో సూసైడ్ నోట్ రాయించటంతోపాటు.. వీడియోలు తీసుకుని తన దగ్గర పెట్టుకున్నదని చెబుతూ.. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పాడు భర్త శ్రీకాంత్.
Also Read :- బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో కీలక మలుపు
వ్యాళికల్ పోలీస్ స్టేషన్ లో భర్త శ్రీకాంత్ కంప్లయింట్ చేశాడనే విషయం తెలిసిన వెంటనే భర్త, అతని కుటుంబ సభ్యులపై కూడా కంప్లయింట్ చేసింది భార్య బిందు. కట్నం కోసం వేధిస్తున్నారంటూ కంప్లయింట్ చేసింది భార్య బిందు.
దీనిపై మీడియా, పోలీసులు భార్య బిందును ప్రశ్నించగా.. రోజుకు 5 వేల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్ చేయలేదని చెబుతూనే.. నా పెళ్లి కోసం మా కుటుంబ సభ్యులు ఖర్చు పెట్టిన 40 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలని మాత్రం అడిగిన విషయాన్ని అంగీకరించటం మాత్రం కొసమెరుపు. విడాకులు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నానని.. మా కుటుంబ సభ్యుల ఖర్చు చేసిన 40 లక్షలు తిరిగి ఇప్పించాలంటూ పోలీసులను సైతం భార్య బిందు చెప్పటం విశేషం.
రెండు కంప్లయింట్స్ తీసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. వారి దగ్గర ఉన్న ఆధారాలతోపాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.