ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించిన, ప్రకటిస్తు్న్న విషయం తెలిసిందే. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలా అనేక టెక్ దిగ్గజ కంపెనీలు గత రెండేళ్లుగా తమ కంపెనీ ఉద్యోగులకు ఉద్వాసన పలుతుకున్నాయి. చాలా మంది టెకీలు తమ జాబ్ లను కోల్పోయారు. ఇంకా చాలామందిని ఉద్యోగాలనుంచి తొలగించే అవకాశం ఉందని ఆయా టెక్ కంపెనీలు ప్రకటించాయి. లేఆఫ్స్ విషయంలో టెకీలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరుగుతోంది. ఈక్రమంలో బెంగుళూరుకు చెందిన ఓ టెకీ తాను పనిచేస్తున్న కంపెనీ పరిస్థితిగురించి చేసి ట్వీట్ మరుసటో తన ఉద్యోగం నుంచి తొలగించేలా చేసింది.వివరాల్లోకి వెళితే..
బెంగుళూరుకు చెందిన ఓ టెకీ జిష్ణు మోహన్ .. ఫార్మాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఫిబ్రశరి 8న సోషల్ మీడియాలో తన కేరీర్ గురించి ఆందోలన చెందుతూ తాను పనిచేస్తున్న కంపెనీ పరిస్థితిపై పోస్ట్ చేశారు. దీంతో కంపెనీ జిష్ణు మోహన్ ఉద్యోగం నుంచి తొలగించింది.
కేరళలోని కొచ్చి నుంచి రిమోట్ గా నాలుగు సంవత్సరాలుగా ఫార్మా(గతంలో ట్వీక్) లో పనిచేసిన మోహన్.. పెద్ద కంపెనీ పునర్నిర్మాణానికి బలయ్యాడు. ట్వీక్ టెక్ సెక్టర్ లోని మాంద్యం గురించి , తన ఉద్యోగ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు. టెక్ కంపెనీ మాంద్యం పరిస్థితి నన్ను కలవరపెడుతోంది.. బహుశా నేను కొద్దికాలమే ఈ సంస్థలో ఉండేలా ఉన్నాను’’ అని జిష్ణు మోహన్ పోస్ట్ లో రాశాడు. దీంతో కంపెనీ అతనిని మరుసటి రోజే ఉద్యోగం నుంచి తొలగించింది.
టెక్ ప్రపంచంలో పరిస్థితులు ఎంత త్వరగా మారిపోతాయో మోహన్ కథ మనకు గుర్తు చేస్తుంది. ఆర్థిక సమస్యలు, కంపెనీలో మార్పులు ఆకస్మాత్తుగా టెకీల వృత్తిని ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవలే కంపెనీ వృద్ధిలో భాగంగా ఖర్చులను ఆదా చేసే పేరుతో గూగుల్ వెయ్యిమంది ఉద్యోగులను తొలగిచింది. కంపెనీ లాభాల మార్జిన్లను మెరుగు పర్చుకోవాలని విప్రో కూడా వందలాది మంది ఉద్యోగులను తొలగించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
మార్జిన్ లను మెరుగు పర్చడానికి , ఖర్చులను ఆదా చేయడానికి టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించడం ట్రెండ్ గా మారిందని ఇది సూచిస్తుంది. ఉద్యోగాల కోతలు ప్రాథమికంగా మధ్యతరగతి, ఆన్ సైట్ లో పనిచేసే వారిని లక్ష్యంగా చేసుకుంటాయి. అమెజాన్ తన ఆరోగ్య విభాగాలను నుంచి ఉద్యోగులను మరో రౌండ్ తొలగించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులను తొలగించే కంపెనీల లిస్టులో వన్ మెడికల్, అమెజాన్ ఫార్మసీ ఉన్నాయి.