కార్పొరేట్ కంపెనీల్లో అన్స్పోకెన్ టాక్సిక్ రూల్స్..రాపిడ్-ఫైర్ హిందీ, చైన్-స్మోకింగ్

కార్పొరేట్ కంపెనీల్లో అన్స్పోకెన్ టాక్సిక్ రూల్స్..రాపిడ్-ఫైర్ హిందీ, చైన్-స్మోకింగ్

బెంగళూరుకు చెందిన ఓ టెకీ అన్ స్పోకెన్ టాక్సిక్ రూల్స్ తో తాను పడ్డ ఇబ్బందుల గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ రెడ్డిట్ ఫ్లాట్ ఫాంలో ఓ పోస్ట్ చేశాడు. అదేంటంటే..గత నాలుగేళ్లలో తాను పనిచేసిన కంపెనీల్లో రెండు రకాల విషపూరితమైన సంస్కృతులను ఎదుర్కొన్నట్లు పోస్టులో వివరించాడు.. వీటి వల్ల తాను తోటి ఉద్యోగులనుంచి బహిష్కరించబడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పడ్డ బాధను పంచుకునేందుకు రెడ్డిట్ లో పోస్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. ఆ టెకీ ఎలాంటి భాషాపరమైన వివక్షను ఎదుర్కొన్నాడు.. స్మోకింగ్ వల్ల అతని ఎలా ఒంటరయ్యాడు.. 

బెంగళూరులో గత నాలుగేళ్లుగా పలు స్టార్టప్ కంపెనీల్లో పనిచేశాడు.. అయితే ఆ కంపెనీల్లో తరుచుగా అతను ఎదుర్కొన్న సమస్యలు రెండు.. ఒకటి హిందీ భాష వివక్ష. రెండో చైన్ స్మోకింగ్.. ఈరెండింటి వల్ల తాను సహచర ఉద్యోగులనుంచి దూరంగా ఉండాల్సిన సందర్భాలు అనేకం అని చెప్పుకొచ్చాడు. సహచర ఉద్యోగులు ప్రారంభంలో ఇంగ్లీషులో మందలింపు చేసినప్పటికీ కొద్ది నిమిషాలు గడిచేలోపే హిందీలోకి వెళ్లిపోతారని  ఆవేదన వ్యక్తం చేశాడు టెకీ. దాదాపు అంతా నార్త్ నుంచి వచ్చిననవారు కావడం.. ఎక్కువగా హిందీ మాట్లాడటం వల్ల తాను ఇబ్బంది పడ్డానని చెప్పాడు. తాను హిందీ నేర్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారి హిందీ షార్ట్ తనని ఒంటరిని చేసిందని రాసుకొచ్చాడు. 

ఇక రెండోది స్మోకింగ్.. బ్రేక్ టైంలో ఆఫీసు బాల్కనీలో ఉద్యోగుల చైన్ స్మోకింగ్ ఉంటుంది..ఈ సమయంలో ప్రాజెక్టుల గురించి చర్చ, మేనేజర్లపై జోక్స్, చిట్ చాట్ తో నిండిపోతుంది.కెరీర్ పరమైన డిస్కషన్స్ జరుగుతాయి.. అయితే తాను స్మోకింగ్ చేయకపోవడం వల్ల తాను తోటి ఎంప్లాయీస్ నుంచి దూరమయ్యేవాడినని చెప్పాడు. దీంతో చాలా అవకాశాలు మిస్సయ్యేవని రెడ్డిట్ లో రాశాడు. 
ఇక మరొక సమస్య కూడా తనని ఇబ్బంది పెడుతుందని చెప్పుకొచ్చాడు టెకీ. అది గ్లాసులు కొట్టడం. మీరు తాగకపోతే తోటి ఉద్యోగులతో కలిసి పోలేని పరిస్థితి ఏర్పడుతుంది. స్నేహాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుందని టెకీ రాశాడు.  

టెకీ రెడ్డిట్ పోస్టుపై నెటిజన్లు విపరీతంగా స్పందించారు. టెకీ ఎదుర్కొన్న సమస్యలను అనుభవించిన వారి పోస్టులతో రిప్లై బాక్సు నిండిపోయింది. ఓ నెటిజన్ స్పందిస్తూ.. నిజంగా ఇలాంటి అన్ స్పోకెన్ టాక్సిక్ రూల్స్ దారుణమైనది.. భయంకరమైనవి..కంపెనీల నిర్వహణలో మార్పు చాలా అవసరం అని రాశాడు. 

తాము కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు రిప్లై ఇచ్చాడు. మొదటి సమస్య దాదాపు అన్ని కంపెనీల్లో ఉంది.. ఇది పక్షపాత ధోరణి అని రాశాడు. ఇక రెండు మూడు సమస్యలు చాలా బాధించేవి.. వీటి వల్ల నా ప్రమోషన్ ఆరు నెలలు ఆలస్యం అయిందని రాశాడు. స్మోక్, డ్రింక్ కలిసి ఉండే మరో వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు.