Trending: టూ మచ్ రారే.. వెరీ టూమచ్: నెలకు 8 లక్షల జీతం సరిపోవటం లేదంట.. ఈ లిస్ట్ చూసి మీరేమంటారు..?

Trending: టూ మచ్ రారే.. వెరీ టూమచ్: నెలకు 8 లక్షల జీతం సరిపోవటం లేదంట.. ఈ లిస్ట్ చూసి మీరేమంటారు..?

Bengaluru News: ఈ రోజుల్లో చాలా మంది ప్రతినెల జీతం వచ్చే తేదీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. వస్తున్న జీతం ఎంత అనే విషయాన్ని పక్కన పెడితే లక్షల్లో వేతనాలు పుచ్చుకుంటున్న వారు సైతం తమ అవసరాలు తీర్చుకోవటానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బెంగళూరులో నివసిస్తున్న ఒక యువ టెక్కీ పంచుకున్న విషయం ఆందోళన కలిగిస్తోంది. 

తాజాగా ఆస్ ఓరా జైన్ అనే యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనకు బెంగళూరులో నివసించటం అసాధ్యంగా మారిందని పేర్కొన్నారు. తన వార్షిక పే ప్యాకేజ్ రూ.కోటి 80లక్షలుగా ఉన్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం ప్రిన్సిపల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో పనిచేస్తున్నానని.. ఈ వేతనంతో బెంగళూరులో జీవించటం అసాధ్యంగా మారిందని తన లింక్డిన్ ఖాతాలో పంచుకున్నాడు. అయితే పన్నుల తర్వాత తాను నెలకు రూ.8లక్షల 30వేలు, వార్షికంగా కోటి రూపాయలు పొందుతున్నట్లు వెల్లడించాడు. అయితే తనకు నెలకు రూ.8లక్షల 87 వేలు ఖర్చవుతోందని తన స్పెండింగ్ లిస్ట్ బయటపెట్టాడు.

బాబుగారి నెల ఖర్చుల చిట్టీ చూస్తే..
* బెంగళూరు ఇందిరానగర్ లో ఇంటి అద్దె రూ.లక్ష 50వేలు
* బీఎండబ్ల్యూ, బెంజ్ కార్ల ఈఎంఐ నెలకు రూ.80వేలు
* లాండ్రీ ఇతర ఖర్చులు రూ.15వేలు
* జొమాటో స్విగ్గీ ఆర్డర్ల బిల్ రూ.70వేలు
* 5 స్టార్ హోటళ్లలో తిండి, కాక్ టైల్స్ కోసం రూ.లక్ష 20వేలు
* గోవా, దుబాయ్ వీక్లీ ట్రిప్స్ ఖర్చు రూ.లక్ష
* బ్రాండెడ్ వైట్ టీషర్ట్స్ రూ.10వేలు
* అర్గానిక్ వైన్స్ రూ.50వేలు
* జిమ్ ట్రైనింగ్ ఖర్చులు రూ.12వేలు
* స్టాక్ మార్కెట్లు, క్రిప్టో పెట్టుబడులు రూ.లక్ష

మెుత్తం ఈ టెక్కీకి వస్తున్న శాలరీ నెలకు రూ.8 లక్షల 30వేలుగా ఉండగా.. తనకు మాత్రం నెలకు రూ.8 లక్షల 87వేలు ఖర్చవుతోందంటున్నాడు. కేవలం తనకొస్తున్న శాలరీ బతకలటానికే సరిపోతోందని, బెంగళూరులో పెరుగుతున్న ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేశాడు. 

 

దీనిపై నెటిజన్లు మాత్రం సీరియస్ గానే స్పందిస్తున్నారు. బెంగళూరులో కేవలం రూ.30వేల వేతనంతో జీవించే వ్యక్తులు ఉన్నారు.. నగరం నిన్ను ఎక్కువ ఖర్చు చేయమని అడగటం లేదు కద అంటూ కామెంట్ చేశాడు. చాలా మంది వారికి ఉన్న దానిలో ఆనందంగా జీవిస్తారు కాబట్టి నీలాంటి లగ్జరీ జీవితం అవసరం లేదంటూ టెక్కీని ప్రశ్నించాడు. చాలా మంది ఏడాది వేతనంగా అందుకునే ఇంత మెుత్తాన్ని నెలలో ఖర్చు చేస్తూ ఇంకా డబ్బులు చాలటం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని చాలా మంది వెక్కిరిస్తున్నారు. ఇంత ఓవర్ యాక్షన్ పనికిరాదంటూ మరికొందరూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ పే ప్యాకేజ్ మార్చుకుందాం అనగా మరొకరు బయటి తిండితో త్వరలోనే అనారోగ్యం పాలవుతావంటూ హెచ్చరించారు.