బెంగళూరులో దారుణం జరిగింది. ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తానని మేనమామ బ్లాక్ మెయిల్ చేయడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని(24) హోటల్ గదిలోనే నిప్పంటించుకుంది. జనవరి 12న ఈ ఘటన జరగ్గా..16న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుహాసి సింగ్.. ఆరేళ్లుగా ఆమె తన మామ(ప్రవీణ్), అత్తతో కలిసి KR పురంలోని SVS ప్యారడైజ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. కాలక్రమేణా సుహాసీ సింగ్ తన మేనమామ ప్రవీణ్ ఇద్దరూ తరచుగా కలిసి ప్రయాణించేవారు. ఈ క్రమంలో మేనమామ ప్రవీణ్ తో శారీరకంగా దగ్గరైంది. అయితే ఇద్దరు ఏకాంతంగా ఉన్న ప్పుడు ఆమెకు తెలియకుండా ప్రవీణ్ ఫోటోలు,వీడియోలు తీసి పెన్ డ్రైవ్ లో సేవ్ చేశాడు. అయితే కొన్ని రోజుల తర్వాత సుహాసి సింగ్ ప్రవీణ్ ను దూరం పెట్టింది. సుహాసీ వేరే వ్యక్తితో క్లోజ్ గా ఉంటున్న విషయాన్ని ప్రవీణ్ తెలుసుకున్నారు.ఆమె వాట్సప్ లో చాటింగ్ కూడా చదివాడు.
ALSO READ | జమ్మూలో అంతుచిక్కని మరణాలు
ఇవన్నీ తెలిసి కూడా తనతో సంబంధం కొనసాగించాలని తన మేనకోడలుసుహాసి సింగ్ పై ఒత్తిడి తెచ్చాడు. ఐటీపీఎల్ మెయిన్ రోడ్డులో తాను బుక్ చేసుకున్న హోటల్ గదిలో సుహాసిని కలవాలని డిమాండ్ చేశాడు. రాకపోతే తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ,వీడియోలను తన ఆమె తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో సుహాసి ఒక బాటిల్ లో పెట్రోల్ తీసుకుని హోటల్ గదికి వెళ్లింది. శారీరకంగా కలవాలని ఒత్తిడి తేవడంతో హోటల్ గదిలోనే తనను తాను నిప్పంటించుకుంది. ప్రవీణ్ ఆమెను బాత్రూమ్‌కి తీసుకెళ్లి షవర్ ఆన్ చేసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు.. కానీ అప్పటికే సుహాసికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను విక్టోరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు జనవరి 12న రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందింది.
నిందితుడు ప్రవీణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గరి నుంచి మొబైల్, పెన్ డ్రైవ్ ను స్వాధీనం చేసుకున్నామని వైట్‌ఫీల్డ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ శివకుమార్ గునార్ తెలిపారు. హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్‌లో బీఎన్ఎస్ సెక్షన్ల కింద ప్రవీణ్ అతని భార్యపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని చెప్పారు పోలీసులు.