ఒక ఉద్యోగం దొరికితే చాలు అనుకునే ఈ రోజుల్లో ఓ అమ్మాయి ప్యాకేజీ తక్కువగా ఉందనే కారణంతో ఏకంగా 13 జాబ్‌లను వదిలేసింది. అదీ 20 ఏళ్ల వయస్సులోనే. తక్కువ ప్యాకేజీ అంటే ఏంటో అనుకునేరు... అందులో సంవత్సరానికి రూ.17 లక్షల ప్యాకేజీ కూడా ఉంది. ప్రస్తుతం ఆమె రూ.20 లక్షలకు పైగా ప్యాకేజీతో టెక్కీగా స్థిరపడి ఔరా అనిపిస్తోంది.
బెంగళూరుకు చెందిన ఆ టెక్కీ సక్సెస్ స్టోరీ వివరాలివే.. రితీ కుమారి అనే టెక్కీ తన కాలేజీలో ఉన్న సమయంలోనే ఎంఎన్సీల నుంచి 13 జాబ్ఆఫర్లను అందుకుంది. అందులో ఒక కంపెనీ రూ.17 లక్షల జీతం ఆఫర్ చేసింది.
ALSO READ:ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వైఎస్ షర్మిల.. సుదీర్ఘ పాదయాత్ర చేసిన మహిళగా చరిత్ర
అయితే ఆమెకు ప్యాకేజీ నచ్చలేదు. జాబ్‌కి బదులుగా రూ.85వేలు స్టైఫండ్పే చేసే 6 నెలల వాల్‌మార్ట్ ఇంటర్నషిప్ప్రోగ్రాంలో జాయిన్ అయింది. ఈ నిర్ణయం ఆమె తల్లిదండ్రులకు నచ్చలేదు. ఎలాగైనా ఇంకా మంచి ప్యాకేజీతో జాబ్కొడతాననే నమ్మకం ఆమెను ముందడుగు వేసింది.
ఇంటర్న్షిప్చేసిన వెంటనే రూ.20 లక్షల ప్యాకేజీతో ఓ ఎంఎన్సీలో జాబ్ సంపాదించిన స్ఫూర్తిగా నిలిచింది. జీవితంలో ఎప్పుడు వెనకడుగు వేయకూడదని కొన్ని కఠిన నిర్ణయాలు విజయాన్ని అయినా తెచ్చిపెడ్తాయి లేదా అనుభవాన్ని అయినా మిగులుస్తాయని ఏదైనా రిసీవ్ చేసుకునే గుణం ఉండాలని ఆమె చెబుతున్నారు.