హైదరాబాద్లో స్విగ్గీ, జొమాటోకు పోతున్న డెలివరీ బాయ్స్కు ఈ సంగతి తెలిస్తే అంతే..!

హైదరాబాద్లో స్విగ్గీ, జొమాటోకు పోతున్న డెలివరీ బాయ్స్కు ఈ సంగతి తెలిస్తే అంతే..!

హైదరాబాద్లో డెలివరీ బాయ్గా లేదా ర్యాపిడోకు పోతున్న మీ దోస్త్ గానికి అర్జెంట్గా గీ ముచ్చట చెప్పండి. బెంగళూరులో ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో గత సోమవారం ఒక్కరోజే 6 వేల మంది డెలివరీ బాయ్స్పై ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించింనందుకు కేసులు నమోదైనయ్.

ఇందులో.. అత్యధికంగా 2,304 కేసులు పైలాన్ రైడర్స్.. అదేనండీ బైక్ ట్యాక్సీలో వెనుక కూర్చునే వాళ్లు హెల్మెట్ పెట్టుకోక పోవడం వల్లే నమోదైనట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 1,260 కేసులు నో పార్కింగ్ జోన్స్లో బండి పార్క్ చేసినందుకు, 671 డ్రైవర్లపై నో ఎంట్రీ జోన్ లోకి వెళ్లినందుకు, 523 మంది డ్రైవర్లపై అసలు హెల్మెటే పెట్టుకోనందుకు కేసులు నమోదు చేశారు. 281 మందిపై ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసినందుకు కేసులు బుక్ చేశారు.

షార్ట్ డెలివరీ ట్రిప్స్ కోసం ఈ మధ్య 30సీసీ కంటే తక్కువగా ఉండే ఈ-బైక్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ను ఎక్కడ పడితే అక్కడ, ఫుట్ పాత్, నో ఎంట్రీ అనే తేడా లేకుండా ఇష్టారాజ్యంగా కొందరు డెలివరీ బాయ్స్ పార్క్ చేస్తున్నారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు గట్టిగా ఒక్కరోజు ఫోకస్ పెడితే ఏకంగా ఇంతమంది డెలివరీ బాయ్స్పై కేసులు బుక్ అవడం చర్చనీయాంశమైంది. 

ఫుడ్ను హోం డెలివరీ చేసే యాప్స్, కిరాణా సరుకులు, నిత్యావసరాలు హోం డెలివరీ చేసే యాప్స్ వచ్చాక చాలా మంది యువతకు ఉపాధి దొరికినట్టయింది. నగరాల్లో కొందరు యువత డెలివరీ బాయ్స్గా పార్ట్ టైం, ఫుల్ టైం జాబ్స్ చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. డెలివరీ బాయ్గా పనిచేయాలంటే ద్విచక్ర వాహనం తప్పనిసరిగా ఉండాల్సిందే.

ALSO READ | ప్రేమజంట ముద్దు విషయంలో..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

డెలివరీ బాయ్గా తీసుకునే సమయంలోనే సదరు యాప్ సంస్థ డెలివరీ బాయ్గా పనిచేసేందుకు ఆసక్తిచూపుతున్న వ్యక్తి లైసెన్స్, బైక్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తుంది. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే డెలివరీ బాయ్గా పనిచేసే అవకాశం కల్పిస్తుంది. అయితే.. కొందరు ఎలాగోలా మస్కా కొట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేకుండానే డెలివరీ బాయ్స్గా వెళుతున్నారు. కొందరు డెలివరీ బాయ్స్కు లైసెన్స్లు కూడా లేని పరిస్థితి. 

డెలివరీ బాయ్స్కు స్విగ్గీ, జొమాటో యూనిఫాం మాదిరి డ్రస్ ఇస్తుంది. ఆ యూనిఫాం ఉంటే తమను  ట్రాఫిక్ పోలీసులు ఆపరనే నమ్మకం కొందరు డెలివరీ బాయ్స్లో ఉంది. కానీ.. హైదరాబాద్లో కూడా బెంగళూరు తరహాలో ట్రాఫిక్ పోలీసులు డెలివరీ బాయ్స్పై నిఘా పెడితే సిటీలో కూడా పెద్ద సంఖ్యలోనే డెలివరీ బాయ్స్పై కేసులు నమోదయ్యే అవకాశం లేకపోలేదు.