బెంగళూరులో తాగునీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుక్కెడు మంచినీళ్లు కోసం నానా తిప్పలు పడాల్సి వస్తోంది.నీళ్ల వాడకంలో ఇప్పటికే ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. వాహనాలు,కడగొద్దని..అనవసరంగా వాటర్ ను వేస్ట్ చేయొద్దని సూచించింది. ఇదే అదునుగా చూసుకుని ప్రైవేట్ ట్యాంకర్లు దోచుకుంటున్నారు. ట్యాంకర్ నీళ్లను ప్రభుత్వం
బెంగళూరులో వాటర్ ట్యాంకర్ ధరలను ప్రభుత్వం పరిమితం చేసిన రెండు రోజుల తర్వాత, నగరంలోని చాలా ప్రాంతాల్లోని నివాసితులు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు తమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు కిలోమీటర్ల దూరం వరకు 12 వేల లీటర్ల ట్యాంకర్ ను బెంగళూరు వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు (BWSSB) వెయ్యి రూపాయలకు నిర్ణయించింది . ఐదు నుంచి 10 కి.మీ దూరానికి రూ. 1200గా నిర్ణయించింది.
అయితే ఇదే అదునుగా తీసుకున్న కొన్ని ప్రైవేట్ వాహనాలు అదనంగా దోచుకుంటున్నాయి. 12 వేల లీటర్ల ట్యాంకర్ కూ రూ. 1500 నుంచి 2 వేల వరకు తీసుకుంటున్నారు. బెంగళూరులో మార్చి 7 వరకు 1391 అధికారిక వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రైవేట్ ట్యాంకర్లు అనుమతి లేకున్నా అధిక రేటుకు వాటర్ అమ్ముకుంటూ జనం దగ్గర దోచుకుంటున్నారు.
వృథా చేస్తే 5 వేల జరిమానా
తాగునీటి ఎద్దడి నేపథ్యంలో నీటి వృథాను అరికట్టేందుకు ఇప్పటికే బెంగళూరు వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు చర్యలు చేపట్టింది. మంచి నీటిని వృథా చేసినా, ఇతర అవసరాలకు వినియోగించినా రూ.5 వేల జరిమానా విధించాలని నిర్ణయించింది. వెహికల్స్ కడగడం, కన్స్ట్రక్షన్, ఎంటర్టైన్మెంట్ కోసం మంచినీటిని వాడకూడదని స్పష్టం చేసింది.
మళ్లీ మళ్లీ నీళ్లను వేస్ట్ చేస్తే ప్రతిసారీ అదనంగా రూ. 500 జరిమానా విధిస్తామని ప్రకటించింది.బెంగళూరు జనాభా 1.3 కోట్లు.. సిటీ రోజువారీ నీటి అవసరాలలో ప్రస్తుతం 1,500 ఎంఎల్‌డీ కొరతను ఎదుర్కొంటోంది. బెంగళూరు తోపాటు తుమకూరు, ఉత్తర కన్నడ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లోనూ త్వరలో ఇదే పరిస్థితి తలెత్తేలా ఉంది. రాష్ట్రంలో 219 తాలూకాలు తీవ్రమైన కరువు ఎదుర్కొంటుండగా, 236 తాలూకాల్లో కరువు ఉన్నట్లు ప్రభుత్వం చెప్తుంది.