బెంగళూరులోని తెలుగు ఫ్యామిలీల నెత్తిన భారం, కొత్త రూల్ నేటి నుంచే అమలు..

బెంగళూరులోని తెలుగు ఫ్యామిలీల నెత్తిన భారం, కొత్త రూల్ నేటి నుంచే అమలు..

Bengaluru: రెండు తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే పొరుగున ఉన్న బెంగళూరుకు పోయినా తెలుగువారి జాడలు ఎక్కువే. ప్రధానంగా ఉద్యోగ, వ్యాపార, ఉపాధి అవసరాల కోసం వలస వెళ్లిన లక్షల మంది ఫ్యామిలీలు ప్రస్తుతం ఈ టెక్ నగరంలో నివసిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ కనీస అవసరాలకు ప్రజలు భారీగా చెల్లించుకుంటుండగా నేటి నుంచి మరో ఖర్చు అక్కడి వారు జోబులను ఖాళీ చేసేందుకు అమలులోకి వచ్చేసింది. 

వివరాల్లోకి వెళితే ఒక పక్క వేసవి కారణంగా బెంగళూరు నగరంలో చాలా చోట్ల ప్రజలు ఇప్పటికే వాటర్ ట్యాంకర్లను ఆర్డర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరు వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు నీటి పన్నులను నేటి నుంచి పెంచుతున్నట్లు వెల్లడించింది. అయితే తాజా రేట్ల పెంపు నిర్ణయం సామాన్య పౌరులపై పెద్ద భారాన్ని తక్కువగా ఉండే రీతిలో నిర్థారించబడ్డాయని BWSSB చైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ వెల్లడించారు.

సాధారణ గృహ వినియోగదారులకు 8వేల లీటర్ల వరకు వినియోగంపై 0.15 పైసలు లీటరుకు చార్జీ చేస్తుండగా.. దీని తర్వాత లక్ష లీటర్ల వరకు ప్రతి లీటరుపై పైసా ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుందని బోర్డ్ వెల్లడించింది. ఇక ఎత్తైన అపార్ట్మెంట్లకు లీటరుకు రేటు 2 లక్షల లీటర్ల వరకు 0.30 పైసలుగా ఉంచగా.. దీని తర్వాత వినియోగించే ప్రతి లీటరుపై ఒక పైసా అదనంగా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.

Also Read:-ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

ఇక కమర్షియల్ వినియోగదారులకు లీటరుకు 90 పైసల నుంచి రేటు ప్రారంభం అయ్యింది. ఇది గరిష్ఠంగా రూపాయి 90 పైసల వరకు ఉంటుందని బోర్డు పేర్కొంది. దీనికి ముందు మార్చిలో కర్ణాటక డిప్యూటీ సీఎం  డికే శివకుమార్ బెంగళూరులో నీటి సరఫరా రేట్లు దశాబ్ధకాలంగా మార్చలేదని పేర్కొన్నారు. అయితే నష్టాలను పరిగణలోకి తీసుకుని లీటరు నీటి సరఫరా ధరను వాటర్ బోర్డ్ 7 నుంచి 8 పైసలు పెంచాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. అయితే ఇది చాలా ఎక్కువ పెంపుగా ఆయన పేర్కొంటూ నగర ఎమ్మెల్యేలతో మాట్లాడతానని వెల్లడించారు. ఈ క్రమంలో బోర్డుకు డబ్బు డిపాజిట్ చేయకుండా అక్రమంగా నీటి కనక్షన్లు తీసుకుంటున్న పెద్ద అపార్ట్మెంట్లను నోటీసులు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.