బెంగళూరు మహిళ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. డీఎస్పీ బట్టలు విప్పి రూ.25 లక్షలు డిమాండ్ చేశారని సూసైడ్ నోట్

బెంగళూరు మహిళ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. డీఎస్పీ బట్టలు విప్పి రూ.25 లక్షలు డిమాండ్ చేశారని సూసైడ్ నోట్

బెంగళూరులో   నవంబర్ 22న  మహిళా వ్యాపార వేత్త ఎస్ జీవా ఆత్మహత్య  చేసుకున్న  సంగతి తెలిసిందే.. అయితే  మహిళ రాసిన సూసైడ్ నోట్  ఇపుడు కలకలం రేపుతోంది.  సీఐడీ ఆఫీసర్ తనను వేధించారని..బట్టలు విప్పించి రూ. 25లక్షల  లంచం డిమాండ్ చేశారని 11 పేజీల సూసైడ్ నోట్ రాసింది .  జీవా మృతికి  డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కనకలక్ష్మి   కారణమంటూ మృతురాలి సోదరి ఎస్ సంగీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో డిప్యూటీ సూపరింటెండెట్ ఆఫ్ పోలీస్ కనకలక్ష్మిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   డీఎస్పీ కనకమహాలక్ష్మీ  మహిళను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేశారు. 

వ్యాపార వేత్త ఎస్ జీవా బెంగళూరులోని పీణ్యలో చెక్క వస్తువుల దుకాణాన్ని నడుపుతోంది.  వృత్తిరీత్యా న్యాయవాది.  కర్నాటక భోవి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో మెటీరియల్స్ సరఫరా చేసిన నిందితుల్లో ఎస్ జీవా ఒకరు. ఈ కేసుకు సీఐడీ బాధ్యతలు అప్పగించింది.  నవంబర్ 14 , నవంబర్ 23 మధ్య వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్ జీవాను ప్రశ్నించడానికి కర్ణాటక హైకోర్టు CIDకి  అనుమతించింది. అయితే CID ఆమెను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

అయితే విచారణ సందర్భంగా నవంబర్ 14న వ్యాపారి ఎస్ జీవాను సీఐడీ అధికారి కనకమహాలక్ష్మీ వేధించారు.  బట్టలు విప్పించి రూ.25 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే  జీవా సమర్పించిన డాక్యుమెంట్స్ ను తీసుకోవడానికి డీఎస్పీ నిరాకరించారు. తర్వాత కొన్ని రోజులుగా జీవాను  వేధిస్తూనే ఉన్నారు.  సీఐడీ అధికారి కనకమహాలక్ష్మీ  జీవా షాప్ కు వెళ్లి అవమానపరిచారు. ఇలా  జీవా ఆత్మహత్య చేసుకునే విధంగా డీఎస్పీ కనకమహాలక్ష్మీ ప్రేరేపించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు పోలీసులు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.