- కర్నాటకలోని బెంగళూరులో దారుణం
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. పార్కులో కూర్చున్న మహిళను కిడ్నాప్ చేసి, రేప్ చేశారు. నలుగురు దుండగులు కలిసి నడుస్తున్న కారులో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితులందరినీ అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.
‘‘ఈనెల 25న కోరమంగళలోని నేషనల్ గేమ్స్ విలేజ్ పార్క్‌లో తన ఫ్రెండ్‌తో ఓ మహిళ కూర్చుంది. రాత్రి 10 గంటల సమయంలో పార్కులో ఏం చేస్తున్నారంటూ నిందితుల్లో ఒకడు వారిని ప్రశ్నించాడు. తర్వాత ఆమె ఫ్రెండ్ వెళ్లిపోగానే..మరో ముగ్గురితో కలిసి మహిళను ఎత్తుకెళ్లాడు. బయట పార్క్ చేసిన కారులో ఎక్కించి.. గ్యాంగ్‌రేప్ చేశారు. తర్వాత తెల్లవారుజామున ఆమె ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. విషయాన్ని పోలీసులకు చెబితే చంపేస్తామని హెచ్చరించారు. తర్వాత బాధితురాలు చికిత్స చేయించుకుని.. ఫిర్యాదు చేసింది” అని పోలీసులు తెలిపారు.