ఆమె మహిళ.. పెద్దోళ్లు అయితే అమ్మా.. మరీ పెద్దోళ్లు అయితే బామ్మగారు.. చిన్నోళ్లు అయితే అమ్మాయి.. పిల్లలు అయితే చిట్టీ, బుజ్జీ, కన్నా అంటారు.. అదే మధ్య వయస్సు వాళ్లను ఆంటీ అంటీ అని.. యూత్ ను అయితే సిస్టర్ అనో.. పాప అనో.. అమ్మాయి అనో అంటారు.. అదే మహిళ మరీ క్లాస్ గా ఉంటే మేడం అనో అంటారు.. ఆయా మహిళ కనిపించే తీరు.. వయస్సు ఆధారంగా అలా పిలవటం కామన్.. ఎందుకంటే వాళ్ల పేర్లు తెలియదు కదా..
ఇలాంటి సిట్యువేషన్ లో.. ఓ బ్యాంక్ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న కృష్ణయ్య అనే వ్యక్తిని చెప్పుతో కొట్టింది అశ్వినీ అనే మహిళ. దీనికి కారణం.. ఆంటీ అని పిలిచినందుకే.. అవును.. ఆంటీ అంటే మండదా.. కోపం రాదా అంటూ మరో రెండు చెప్పు దెబ్బలు తగిలించేలోపు పక్కనోళ్లు అడ్డుకోవటంతో బతికిపోయాడు ఆ సెక్యూరిటీ గార్డు.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : హుస్సేన్ సాగర్ లో మట్టి వినాయకులు మాత్రమే నిమజ్జనం : హైకోర్టు సంచలన తీర్పు
2023 సెప్టెంబర్ 19 న అశ్వినీ అనే మహిళ మనీ డ్రా చేసుకోడానికి ఏటీఎం దగ్గరికి వచ్చింది. డబ్బులు డ్రా చేసుకోని డోర్ దగ్గర నిల్చుని ఉన్న ఆమెను సెక్యూరిటీ గార్డు కృష్ణయ్య కాస్త పక్కకు జరగండి అంటీ అని అనగా.. ఆమె ఆగ్రహాంతోఊగిపోయింది. దీంతో తన చెప్పుతో సెక్యూరిటీని చెంపదెబ్బ కొట్టింది. అతనిపై శారీరకంగా దాడి చేయడమే కాకుండా పదజాలంతో కూడా దూషించింది.
అశ్వినిపై కృష్ణయ్య మల్లేశ్వరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కాసేపటికే ఆమె బెయిల్ పై బయటకు వచ్చింది. ఈ ఘటనలో సెక్యూరిటీకి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.