
బెంగళూరు సిటీలో బిజీ లైఫ్ గురించి మనందరికి తెలుసు..ఎంత బిజీగా ఉంటుందో అంత సంపాదనకు మంచి అవకాశాలున్నాయి.రెండో ఆర్థిక రాజధానిగా, సిలికాన్ వ్యాలీగా పేరున్న ఈ సిటీలో టెకీలు రెండు చేతులా సంపాదిస్తారు. టెకీలు వారానికి ఐదు రోజులే పనిచేస్తారు మనందరికి తెలుసు.. అయితే వీకెండ్స్ టెకీలు ఏం చేస్తారు. ఏ పబ్ లకు, రెస్టారెంట్లకో, వీకెండ్ వెకేషన్లకు వెళ్తుంటారు. లేదా సెల్ ఫోన్లోనో, ల్యాప్ టాప్ లలో ఏదైనా ఎంటర్ టైన్ మెంట్ వెతుక్కుంటూ ఉంటారు.. అయితే బెంగళూరు ఇన్ఫోసిస్ ఎంప్లాయ్ ఏం చేశాడో చూడండి..
బెంగళూరు ఇన్ఫోసిస్ ఎంత ఫేమస్.. అలాంటి కంపెనీలు పనిచేస్తున్నాడు..సంపాదన బాగానే ఉంది..అయినా ఇన్ఫోసిస్ ఉద్యోగి ఏం చేశాడో చూశారా.. వీకెండ్ రెండు రోజులు ఎంజాయ్ చేయడం పక్కన పెట్టి.. బైక్ టాక్సీ నడుపుతున్నాడు.. ఎందుకలా అంటే అతను చెప్పిన కారణం చాలామందికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఆ ఎంప్లాయీకి సంబంధించిన వివరాలు, అతను ఎందుకు అలా బైక్ ట్యాక్సీ నడుపుతున్నాడు..వివరాలన్నీ ఓ నెటిజన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
బెంగళూరుకు చెందిన చార్మిఖా నాగల్ల ఈ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను బైక్ ట్యాక్సీని బుక్ చేయగా .. బైక్ రైడర్ తీరును చూసి ఆశ్చర్యపోయింది. అతను మాట్లాడే విధానం, కార్పొరేట్ లెవెల్ లాంగ్వేజ్ చూసి డౌటొచ్చిన నాగల్ల ట్రావెల్ చేస్తూ అతని గురించి ఆరా తీస్తే చాలా అతని గురించి చాలా విషయాలు బయటికొచ్చాయి.
బైక్ రైడర్ తనను రీసీవ్ చేసుకున్నప్పుడు చాలా హుందాగా, కార్పొరేట్ లెవెల్ ఇంగ్లీష్ మాట్లాడారని నాగల్ తన పోస్ట్ లో తెలిపింది..దీంతో అతని గురించి తెలుసుకోవాలని ఉత్సుకతతో అడగ్గా.. తాను ఇన్ఫోసిస్ ఉద్యోగిని అని చెప్పాడు.. మరీ ఎందుకిలా బైక్ ట్యాక్సీ నడుపుతున్నారు అన్న ప్రశ్నకు అతని నుంచి వచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోయింది నాగల్ల.
చాలా మంది వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. కొందరు వీకెంటె వెకేషన్ ట్రిప్ వేస్తుంటే.. మరికొందరు పబ్ లు, రెస్టారెంట్లకు ఇలా రకరకాలుగా ఎంజాయ్ ని వెతుక్కుంటారు.. కానీ తనకు అలా కాకుండా భిన్నంగా ఉండాలనిపిస్తోంది అని చెప్పాడట..
అందుకోసం వీకెండ్ సమయాల్లో అలా టైం వృధా చేయడం కంటే.. ఇలా బైక్ ట్యాక్స్ నడుపుతు నగరం మొత్తం చుట్టేస్తుంటాను.. అదే నాకు హ్యాపీగా ఉంటుంది. సమయం వృధా కాకుండా ఉంటుంది. డబ్బులు కూడా వస్తాయి.. అని సమాధానమిచ్చాడట..
బైక్ రైడర్ తీసుకున్న నిర్ణయం చాలా మందికి ఆదర్శం కదా అని నాగల్ల చెప్పుకొచ్చారు. వీకెండ్స్ అధికమొత్తం డబ్బులు వెచ్చించి సమయాన్ని వృధా చేసుకుంటేనే ఆనందం రాదు..ఇలా కూడా సమయాన్ని ఆదా చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ కూడా ఆనందం పొందవచ్చని ఈ బైక్ రైడర్ నిరూపించాడు.. హ్యాట్సాఫ్ అంటూ ఛార్మిఖా నాగల్ల తన పోస్ట్ లో రాశారు. నిజమే కదా..