అది రోడ్డు అనుకున్నారా.. లాడ్జ్ అనుకున్నారా..? నడిరోడ్డు మీద బైక్‎పై రెచ్చిపోయిన ప్రేమ జంట

అది రోడ్డు అనుకున్నారా.. లాడ్జ్ అనుకున్నారా..? నడిరోడ్డు మీద బైక్‎పై రెచ్చిపోయిన ప్రేమ జంట

సోషల్ మీడియాలో ‘ఫేమస్’ పిచ్చితో యువత హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. కొందరు బైకులు, కార్లపై ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండగా.. మరికొందరు తమ లవర్లతో రోడ్డుపైనే బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్‎లో ఉన్నామా..? ప్రైవేట్‎‎గా ఉన్నామా..? అన్న కనీస సోయి మరిచీ నడిరోడ్డుపైనే రొమాన్స్ దుకాణం తెరుస్తున్నారు. ఇంకా బైక్‎పై వెళ్తూనే రొమాన్స్ చేయడం ఇక్కడ హైలెట్. బైక్‎పై వెళ్తూ ప్రపంచాన్ని మరిచిపోయి గాఢ ప్రేమలో విహరిస్తున్నారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన రొమాన్స్ నడిరోడ్డుపైనే చేస్తున్నారు. 

పబ్లిక్ ఏం అనుకుంటుందనే మినిమం సెన్స్ లేకుండా వికృతచేష్టలు చేస్తున్నారు. తాజాగా ఐటీ రాజధాని బెంగుళూరు ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇద్దరు లవర్స్ బైక్‎పై వెళ్తూ గాఢ ప్రేమలో మునిగిపోయారు. చుట్టూ ఎవరూ లేరు అనుకున్నారో.. లేక వాళ్లే ఏదైనా వేరే లోకంలో విహరిస్తున్నామనుకున్నారో తెలియదు గానీ.. నడిరోడ్డు మీదే బైక్‎‎పై రొమాన్స్ చేశారు. ఈ ప్రేమ జంట బాగోతాన్ని వెనక నుంచి కారులో ఒక వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో ప్రకారం.. తమిళనాడు రిజిస్ట్రేషన్‎తో ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‎ను ఓ యువకుడు నడుపుతుండగా.. అతడికి ఎదురుగా పెట్రోల్ ట్యాంక్‏పై యువతి కూర్చొంది.

ప్రేమ పొంగిపొర్లిపోవడంతో ఆగలేక రోడ్డుపైన ప్రేయుడిని గట్టిగా హగ్ చేసుకుంది యువతి. ప్రేయసి కౌగిళ్లలో బంది అయిన ఆ యువకుడు ఇంకా రెట్టింపు ఉత్సహంతో బైక్ నడిపాడు. ఈ తతంగం అంతా వెనక నుంచి కారులో వస్తున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నెట్టింట్లో వీడియో వైరల్ కావడంతో.. పలువురు నెటిజన్లు ఫన్నీగా స్పందింస్తున్నారు. 

అది రోడ్డు అనుకున్నారా.. లాడ్జ్ అనుకున్నారా..? అంటూ ఓ నెటిజన్ ఫన్నీ రియాక్ట్ కాగా.. అందరూ బ్యాక్ వీవ్ కోసం మిర్రర్స్ పెట్టుకుంటే.. మనోడు ఏకంగా లవర్‎నే కూర్చొపెట్టుకున్నాడని ఇంకో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ వీడియోపై ఇప్పటి వరకు బెంగుళూరు పోలీసులు స్పందించలేదు. దీంతో పలువురు నెటిజన్లు వీర ప్రేమికుల నడి రోడ్డుపై రొమాన్స్ బాగోతాన్ని పోలీసులకు ట్యాగ్ చేస్తూ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ జంటపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.