కారులో వర్క్ చేస్తున్న మహిళకు ట్రాఫిక్ పోలీస్ ఫైన్

కారులో వర్క్ చేస్తున్న మహిళకు ట్రాఫిక్ పోలీస్ ఫైన్

ఇంట్లో పని చేసుకోండి లేదంటే ఆఫీసులో వర్క్ చేసుకోండి.. అంతేకానీ రోడ్డెక్కి.. కారు డ్రైవింగ్ చేసుకుంటూ.. డ్రైవింగ్ సీట్లో కూర్చుని.. ల్యాప్ ట్యాప్ తో వర్క్ చేయటం ఏంటీ..ఫోన్ మాట్లాడటమే నేరం అయితే.. అలాంటిది ఏకంగా రోడ్డుపై డ్రైవింగ్ చేస్తూ.. స్టీరింగ్ వదిలేసి ల్యాప్ ట్యాప్ లో వర్క్ చేస్తున్న మహిళకు.. ఫైన్ వేశా రు ట్రాఫిక్ పోలీసులు. బెంగళూరు సిటీలోని ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. ఏకంగా ఆ రాష్ట్ర డీజీపీ స్పందించారు. ఆ మహిళ ఇంటికి వెళ్లి మరీ ట్రాఫిక్ చలానా ఇచ్చారు పోలీసులు. దీనిపై సోషల్ మీడియాలో ఇప్పుడు భిన్న వాదనలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

బెంగళూరులో ఓ మహిళ కారు నడుపుతూ ల్యాప్‌టాప్ ఉపయోగించినందుకు  ట్రాఫిక్ పోలీసులు ఆమెకు జరిమానా విధించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మహిళ కారు  నడుపుతూ డ్రైవింగ్ చేస్తుండగా వీడియో తీసి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఇంటర్నెట్ లో షేర్ చేశారు. ఇలా డ్రైవింగ్ చేయడ కూడా చట్ట ప్రకారం నేరమే.. ప్రమాదాలకు కారణం అవుతుంది.. ఇలాంటి పనులు మరెవ్వరూ చేయకండి అంటూ హెచ్చరిస్తున్నట్లుగా ట్రాఫిక్ పోలీసులు ఈ వీడియోను పోస్ట్ చేశారు. నెటిజన్లు షేర్ చేస్తుండటంతో వైరల్ అయింది. 

ALSO READ | సినిమా స్టంట్ కాదు.. రియల్ యాక్సిడెంట్ : ర్యాపిడో బైక్ డ్రైవర్ ఓవర్ స్పీడ్

సోషల్ మీడియాలో ట్రాఫిక్ పోలీసుల పోస్ట్‌పై నెటిజన్లు భిన్న వాదనలు చేస్తున్నారు. కొందరు ఆ మహిళ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని అంటే.. మరికొందరు పాపం వర్క్ లోడ్ ఎక్కువగా ఉందేమో అని సానుభూతి చూపారు. ‘‘ఇంకో నెటిజన్ స్పందిస్తూ.. ఆమె లైసెన్స్ రద్దు చేయాలి’’ పోస్ట్ చేశారు. "ఎవరిది తప్పు? ఉద్యోగిదా లేదా యజమానిదా ?" అని మరొకరు ప్రశ్నించారు. ఇలా రకరకాల అభిప్రాయాలతో పోస్టులు చేయడంతో మహిళా ల్యాప్ టాప్ వర్క్ అండ్ డ్రైవింగ్ చర్చనీయాంశమైంది.