ఇల్లు అంటే ఓ హాలు, ఓ బెడ్ రూం, ఓ కిచెన్, ఓ టాయ్ లెట్ కామన్.. డిమాండ్ ఉన్నప్పుడు.. ఈ మాత్రం సింగిల్ బెడ్ రూం ఇంటికే వేలకు వేలు అద్దెలు వసూలు చేయటం కామన్.. మరీ డిమాండ్ ఎక్కువగా ఉంటే ఎవరైనా అద్దె పెంచుతారు.. బెంగళూరు ఇంటి ఓనర్లు మాత్రం డిఫరెంట్.. డబుల్ బెడ్ రూం ఇంటిని మూడు ఇల్లుగా మార్చారు. ఓ టాయ్ లెట్ ను బెడ్ రూం చేశారు.. దానికి పక్కనే మరో టాయ్ లెట్ అంత స్థలంలో.. కిచెన్ ఇచ్చారు.. నిల్చుంటే కూర్చోవటానికి స్పేస్ లేదు.. బెడ్ రూం అంటే అది డబుల్ కాట్ బెడ్ పట్టేంత స్థలం కూడా కాదు.. మన దివాన్ సైజులో ఉంటుంది.. ఈ మాత్రం దానికే 12 వేల అద్దె వసూలు చేస్తు్న్నారు ఇంటి ఓనర్లు. ఈ టాపిక్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల, నో బ్రోకర్ యాప్‌లో లిస్ట్ ఔట్ చేసిన బెంగళూరు అపార్ట్‌మెంట్ ను ఒక రెడ్డిట్ యూజర్.. తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది. రూ.12వేల రెంటెడ్ ఇల్లును చూపిస్తూ ఆ వ్యక్తి ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. ఇందులో బెడ్ రూం సెటప్ ఉంది. ఓ బెడ్ తో కూడిన ఈ రూం చాలా ఇరుకుగా కనిపిస్తోంది.
బాత్రూమ్ పరిణామాన్ని పోలే ఈ బెడ్ రూంను చూసిన నెటిజన్లు కామెంట్లతో తమ అభిప్రాయాలను వెల్లడించారు. "ఇది బెడ్‌రూమ్‌గా మార్చబడిన టాయిలెట్" అని చమత్కరించారు. దీని కంటే హాస్టల్స్ మెరుగ్గా ఉంటాయి. చాలా మంది 5నుంచి 7వేలు వసూలు చేస్తారు. అయినప్పటికీ అందులో అన్ని సౌకర్యాలూ ఉంటాయి అని ఇంకొందరు విమర్శించారు.
నిజం చెప్పాలంటే నో బ్రోకర్ యాప్ లిస్టింగ్‌ని నిశితంగా పరిశీలిస్తే.. మహదేవపురలోని 1 RK (1 గది, కిచెన్) ఫ్లాట్‌లో మొదట్లో కనిపించిన దానికంటే ఎక్కువ ఆఫర్లు ఉన్నాయని స్పష్టమైంది. రెడ్డిట్ యూజర్ షేర్ చేసిన అంశాలతో పాటు, ఈ ఫొటోల్లో ఒక గ్యాస్ స్టవ్‌తో వంట ప్రాంతాన్ని చూపించాయి. దాంతో పాటు రెండు చిన్న అల్మారాలు, పక్కనే అందులో బాత్రూమ్ కూడా ఉంది. గ్యాస్ స్టవ్, సిలిండర్, వాటర్ ప్యూరిఫైయర్, చిన్న ఫ్రిజ్ లాంటివి ఈ కాంపాక్ట్ ప్రాంతంలోనే అమర్చడానికి అనువుగా ఉన్నట్టు కనిపించాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటే, వారు ఓ స్పెషల్ సర్వెంట్ స్పేస్ ను కూడా ఈ ఫొటోల్లో చూపించారు. అంటే దీనర్ధం... అద్దెదారు పూర్తి వివరాలు వెల్లడించలేదు. అక్కడ స్పెషల్ రూం కూడా ఉందా అన్నది అందరినీ మరింత విస్మయానికి గురి చేస్తోంది.