హైదరాబాద్ లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బెంజ్ కారు అదుపు తప్పి ట్రాన్స్ ఫారంను ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ కావడంతో కారులో ప్రయాణించే వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అతి వేగం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారు జామున నాలుగు గంటలకు ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. గతంలో ఇదే ప్రదేశంలో హిట్ అండ్ రన్ కారణంగా బౌన్సర్ తారక్ మృతి చెందాడు.