హైదరాబాద్ ఎల్బీ స్టేడియం దగ్గర బెంజ్ కారు దగ్ధం

హైదరాబాద్  ఎల్బీ స్టేడియం దగ్గర బెంజ్ కారు దగ్ధం

హైదరాబాద్ ఎల్బీ స్టేడియం దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఫతే మైదానం దగ్గర బెంజ్ కారులో మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. 

జూలై 5న  రాత్రి ఫతే మైదాన్ క్లబ్ కు కారులో వచ్చారు యజమాని కార్తీక్ రెడ్డి.  రాత్రి కార్ స్టార్ట్ కాకపోవడంతో  ఫతే మైదాన్ పార్కింగ్ లోనే కారును వదిలి వెళ్లిపోయాడు.  ఈ రోజు కారును  స్టార్ట్ చేసేందుకు కొత్త బ్యాటరీ తీసుకొచ్చాడు  డ్రైవర్ కిరణ్.  బ్యాటరీ మారుస్తుండగా కారు ఇంజిన్ లో నుంచి ఒక్కసారిగా మంటలు  చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా వ్యాప్తి చెందడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.