ఐపీఓకు వస్తున్నాం... బెర్గ్​నర్​ సీఈఓ ఉమేశ్​ గుప్తా

ఐపీఓకు వస్తున్నాం... బెర్గ్​నర్​  సీఈఓ ఉమేశ్​ గుప్తా

హైదరాబాద్​, వెలుగు: ఐపీఓకు రావడానికి సిద్ధమవుతున్నామని,  2027లో పబ్లిక్​ఇష్యూ ఉండొచ్చని వంట పాత్రల తయారీ కంపెనీ బెర్గ్​నర్ ​ఇండియా ఎండీ ​ఉమేశ్​గుప్తా చెప్పారు. హైదరాబాద్​లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రియాకు చెందిన తమ కంపెనీ ఇండియా మార్కెట్లో 1,800 రకాల ప్రొడక్టులను అమ్ముతోందని చెప్పారు. 

‘‘వీటిలో చాలా ప్రొడక్టులను మిడిల్​ఈస్ట్​, యూరప్​ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మాకు ఇండియా వ్యాప్తంగా ఎనిమిది వేల మంది డీలర్లు ఉన్నారు. ఢిల్లీలో ప్లాంటు ఉంది. వచ్చే ఏడాది 30 శాతం గ్రోత్​ను ఆశిస్తున్నాం. హైదరాబాద్​ మార్కెట్లో 12 శాతం వరకు గ్రోత్​ ఉండొచ్చు. తెలంగాణలో మాకు 172 మంది డీలర్లు ఉన్నారు”అని ఉమేశ్​ గుప్తా వివరించారు.