సంపదలో సామ్రాట్

రాజులకే రాజు చక్రవర్తి. శ్రీమంతులను మించిన ధనవంతుడు ఈ ‘లగ్జరీ’ చక్రవర్తి. ప్రపంచానికి ‘సిరి’కొత్త కుబేరుడనే టైటిల్​ సాధించటానికి అడుగు దూరంలోనే ఉన్నాడు. ‘రేపో.. మాపో..’ అనేంత జెట్​ స్పీడ్​లో ఆ రికార్డ్​ సృష్టించటానికి రెడీ అయ్యాడు. ఆ బిలియనీర్​ పేరే బెర్నార్డ్​​ ఆర్నాల్ట్​. దేశం: ఫ్రాన్స్​. వయసు: 70 ఏళ్లు. సంపద: రూ.7 లక్షల 70 వేల కోట్లు. కష్టాల్లో ఉన్న టెక్స్​టైల్​ కంపెనీ కొని, బిజినెస్​ చేసి, ఈ రోజు వరల్డ్​లోనే అతి పెద్ద లగ్జరీ గూడ్స్​ గ్రూపు​గా డెవలప్​ చేశారు. 1984లో ప్రారంభమైన ఈ శ్రీమంతుడి ప్రస్థానం 35 ఏళ్లుగా సాగుతోంది.

బెర్నార్డ్​ ఆర్నాల్ట్ గ్రూపులోని 75​ కంపెనీల లిస్టులో లేటెస్ట్​గా టిఫానీ చేరింది. దీంతో సంపాదనలో బిల్​గేట్స్​ని మించిపోయారు. అమెజాన్​ సీఈవో బెజోస్​ని వెనక్కి నెట్టడమే తరువాయి. ‘ప్రపంచంలోనే నంబర్–1​ రిచ్​ పర్సన్’ ర్యాంక్​ సొంతం చేసుకుంటారు         ఋ. కేవలం రూ.15 వేల కోట్లు వస్తే చాలు. అదీ జరిగిపోతుంది. ఆర్నాల్ట్​ ఆదాయం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ల్యాండ్​మార్క్​ని చేరుకోవటం పెద్ద లెక్కేం కాదు. ఆయనకు ఇలాంటి ఎదుగుదల ఎలా సాధ్యమైంది?.

వ్యాపార సూత్రం ఇదే!

‘విలాస వస్తువులే విశేష లాభాలు తెస్తాయి’ అని ఆర్నాల్ట్​ అంటుంటారు. దీన్నే బిజినెస్​ సూత్రంగా ఫాలో అయ్యారు. డ్రింక్స్, ఫ్యాషన్, లెదర్​ గూడ్స్, జొవెలరీ, వాచ్​లు, పెర్​ఫ్యూమ్స్, కాస్ట్యూమ్స్​​ ఇలా 70కిపైగా వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టారు. పట్టిందల్లా బంగారం చేశారు. ఆర్నాల్ట్​కి ఆదాయం ఎక్కువగా ‘లూయిస్​ వ్యుట్టన్ మోయెత్​ హెన్నెస్సీ’(ఎల్​వీఎంహెచ్​) సంస్థలో తన ఫ్యామిలీకి ఉన్న 47 శాతం వాటాల ద్వారా వస్తోంది. ఆ కంపెనీకి ఆయన చైర్మన్​, సీఈఓ కూడా.

ఎల్​వీఎంహెచ్​కి ఊహించని లాభాలు వస్తుండటంతో కంపెనీ షేర్లు ఈ ఏడాది ఇప్పటికి 55 శాతానికి పెరిగాయి. ఇప్పుడు ఈ​ గొడుగు కిందికి వచ్చిన టిఫ్ఫానీ కూడా  అద్భుత పనితీరు కనబరిస్తే ఆర్నాల్ట్​ రాబడి మరింత పెరగటం ఖాయం. లగ్జరీ అంటే ఇష్టపడే మిడిల్​ క్లాస్​ కస్టమర్లను(ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో) ఆకట్టుకుంటూ వేగంగా అభివృద్ధి చెందుతున్న టిఫానీని కొనాలని ఆర్నాల్ట్ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అది ఇప్పటికి నెరవేరింది.

అన్నీ ఒకే చోటే దొరికితే..

కస్టమర్లు లగ్జరీ బ్యాగ్​లు కొంటే వాటిని ఖాళీగా ఇంటికి పట్టుకుపోరు. ఏదో ఒక వస్తువు తీసుకొని అందులో వేసుకొని పోతారు. ఆ వస్తువు ఏదైనా కావొచ్చు. డ్రెస్​లు, షూ, నగలు.. ఇలాంటివి షాపింగ్​ చేస్తారు. అదే సమయంలో టైమ్​పాస్​ కోసం డ్రింక్స్​ తాగుతారు. వీటన్నింటినీ ఒకే కంపెనీ వేర్వేరు బ్రాండ్​నేమ్​లతో తయారుచేసి ఒకే చోట దొరికేలా చేస్తే ఎంత బాగుంటుంది?. ఈ ఐడియానే ఎల్​వీఎంహెచ్​ని  పాపులర్​ చేసింది. కస్టమర్ల ఆలోచనలకు తగ్గట్లు వ్యాపారాన్ని మార్చుకుంటూ దూసుకుపోతోంది.

పాలిటెక్నిక్​ చదివి..

ఫ్రాన్స్​లోని రౌబైక్స్​ ప్రాంతానికి చెందిన ఇండస్ట్రియలిస్టుల ఫ్యామిలీలో 1949 మార్చి 5న పుట్టిన​ ఆర్నాల్ట్​ చిన్నప్పుడు లోకల్​ స్కూల్స్​లోనే చదువుకున్నారు. తర్వాత దేశంలోనే గొప్ప పేరున్న ఎకోల్​ పాలిటెక్నిక్​ కాలేజీలో​ చదివారు.  కుటుంబ సంస్థ ఫెర్రెట్​–సావినెల్ కన్​స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్​గా కెరీర్​ ప్రారంభించారు. వివిధ ఎగ్జిక్యూటివ్​ మేనేజ్​మెంట్​ పొజిషన్లకు ప్రమోటై వయసు 30 ఏళ్లు నిండక ముందే 1978లో సంస్థ చైర్మన్ అయ్యారు.

ఇబ్బందుల్లో ఉన్న టెక్స్​టైల్​ కంపెనీని 1984లో టేకోవర్​ చేసి తన వ్యాపార సామ్రాజ్య విస్తరణకు మూల స్తంభం చేశారు. పదేళ్లలో ఎల్​వీఎంహెచ్​లో పెద్ద వాటాదారయ్యారు. మోయెత్​ హెన్నెస్సీ, లూయిస్​ వ్యుట్టన్​ అనే గ్రూపుల్ని మెర్జ్​ చేసి కంబైన్డ్​ గ్రూప్​ ఎల్​వీఎంహెచ్​కి 30 ఏళ్లుగా సీఈవోగా ఉంటున్నారు. ఎన్నో పెద్ద సంస్థల్ని ఇట్టే కొనేశారు.

టెస్టు, టేస్టు, స్టైల్​.. వీటిని బట్టే గ్రీన్​సిగ్నల్​ ​ ​

ఆర్నాల్ట్​ చాలా విషయాల్లో టేస్టున్న వ్యక్తి. పర్సనల్​గా ఫాలో అయ్యే​ లైఫ్​స్టైల్​ని బేస్​ చేసుకొని ఆయా  ప్రొడక్ట్​ల బిజినెస్​లలోకి ఎంటరవుతూ ఒక్కో మెట్టూ ఎక్కారు. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఆ ప్రొడక్ట్​లు అసలు తనకు నచ్చుతున్నాయా? లేదా? అని టెస్ట్​, టేస్ట్​ చేస్తారు. ఫలానా ఐటమ్​ని తానెందుకు ఇష్టపడుతున్నానో స్టడీ చేసేవారు. అన్ని కోణాల్లో ఆలోచించాకే డీల్స్​ ఓకే చేసేవారు.

రెండు దేశాల రాయబారి​గా..

ఆర్నాల్ట్​ఫ్రాన్స్​ కల్చరల్​ అంబాసిడర్​గా పాపులర్​. బీజింగ్​ ఒలింపిక్స్​కి ముందు ​ఫ్రాన్స్, చైనా మధ్య తలెత్తిన గొడవలు తీర్చటంలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రపంచంలోని ప్రముఖులతో మంచి రిలేషన్స్​ మెయింటెయిన్​ చేస్తారు. 2017లో అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ని కలిసి ఆ దేశంలో తన కంపెనీ విస్తరణపై ఆయనతో మాట్లాడారు.

మెచ్చుకున్న ‘యాపిల్’​ ఫౌండర్

యాపిల్​ కంపెనీ ఫౌండర్​ స్టీవ్​ జాబ్స్​తో ఆర్నాల్ట్​ ఫ్రెండ్లీగా ఉండేవారు. ఒకసారి ఆర్నాల్ట్​ని జాబ్స్​ తెగ మెచ్చుకున్నారు. ‘మరో 50 ఏళ్లు యాపిల్​ ఫోన్​ సక్సెస్​ఫుల్​గా ఉంటుందో లేదో తెలియదు గానీ మీ కంపెనీ డ్రింక్​ మాత్రం జనం వందేళ్లయినా మర్చిపోరు’ అన్నారట. ఫ్రాన్స్​ మాజీ ప్రెసిడెంట్ నికోలస్​ సర్కోజీతో కూడా ఆర్నాల్ట్​ క్లోజ్​గా మెలిగేవారు.

పర్ఫెక్ట్​ పర్సనల్​ లైఫ్​

ఆర్నాల్ట్​ ఎక్కువగా పారిస్​లో ఉంటారు. ఐదుగురు పిల్లల్లో నలుగుర్ని వ్యాపారంలోకి తెచ్చారు.  ఎప్పుడూ బిజీగా ఉన్నా స్టైలిష్​గా ఉండటానికే ఇష్టపడతారు.    ఆటలంటే చాలా ఇష్టం. తరచూ రాకెట్ పట్టుకొని టెన్నిస్ కోర్టులోకి దిగుతారు. తద్వారా తననుతాను ఫిట్​గా ఉంచుకుంటారు. మ్యూజిక్ అన్నా ఆసక్తే. పాటలు పాడరు కానీ పియానో ప్లే చేస్తారు. పెయింటింగ్స్, బొమ్మలంటే ప్రాణం. ఆర్ట్ పీస్​లను లెక్కలేనన్ని సేకరించారు.

ఇంధ్రభవనం లాంటి యాట్

బిలియనీర్లకు ప్రైవేట్​ జెట్​ విమానాలు ఉండటం సహజం. ఆర్నాల్ట్​కీ అలాంటి సొంత విమానం ఉంది. దీంతోపాటు ఇంధ్రభవనాన్ని తలపించే యాట్​ను ఆయన 2015లో 150 మిలియన్​ డాలర్లు పెట్టి స్పెషల్​గా డిజైన్​ చేయించారు. దాని పేరు సింఫనీ. పొడవు 101 మీటర్లు. ఇందులో మొత్తం 16 క్యాబిన్లు ఉన్నాయి. 8 గదుల్లో 20 మంది గెస్టులు ఉండొచ్చు. మిగతా 8 రూముల్ని 18 మంది స్టాఫ్​కి కేటాయించారు.