ఫిబ్రవరి నెల బెస్ట్ డీల్స్: రూ.10 వేలకే 5G సూపర్ ఫోన్లు ఇవే

ఫిబ్రవరి నెల బెస్ట్ డీల్స్: రూ.10 వేలకే 5G సూపర్ ఫోన్లు ఇవే

ప్రతి నెలా రకరకాల5G స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో ప్రారంభించబడుతున్నాయి. 2025 ఫిబ్రవరి నెలలో కూడా మంచి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.  అయితే మం చిఫీచర్లు, స్పెసిఫికేషన్లు, మన బడ్జెట్ కు తగిన సెల్ ఫోన్ ను ఎంచుకోవడం కొంచెం కష్టమైన పనే..కొన్ని స్మార్ట్ఫోన్లు మంచి ఫీచర్లు ఉంటే ధర ఎక్కువగా ఉం టుంది.. మరొకొన్ని ఫోన్లలో ధర తక్కువగా మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉండవు. తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో తక్కువ బడ్జెట్ లో అంటే రూ. 10వేల లోపు ధరతో దొరికే కొన్ని స్మార్ట్ ఫోన్ల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 

Moto G45 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

  • Moto G45 5G స్మార్ట్ ఫోన్ 6.45-అంగుళాల HD+ డిస్‌ప్లేతో120Hz వరకు రిఫ్రెష్ రేట్‌
  • 500 nits బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 
  • Qualcomm Snapdragon 6s Gen 3 చిప్‌ 
  • గ్రాఫిక్ టాస్క్‌ల కోసం Adreno 619 GPU 
  • స్టోరేజీ:  8GB LPDDR4X RAM ,128GB UFS 2.2 స్టోరేజ్‌
  • మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TBకి స్టోరేజీ పెంచుకోవచ్చు. 
  • ఫాస్ట్ ఛార్జింగ్ కోసం..18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు, 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. 
  • ఆండ్రాయిడ్ 14 సిస్టమ్ తో పనిచేస్తుంది. 
  • 1 సంవత్సరం OS అప్‌డేట్లు ,3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. 

Infinix Hot 50 5G:

  • Infinix Hot 50 5G  స్మార్ట్ ఫోన్ లో .. 1600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్. 120Hz రిఫ్రెష్ రేట్‌ ఉంటుంది. 
  • 6.7-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంటుంది. 
  • MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 
  • గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం Mali G57 MC2 GPU ఉంటుంది. 
  • స్టోరేజీ, ర్యామ్ విషయానికి వస్తే.. ఇది 8GB వరకు LPDDR4x RAM ,128GB వరకు UFS 2.2 స్టోరేజ్‌ఉంటుంది. 
  • మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. 
  • కెమెరా విషయానికి వస్తే.. ఫోన్ 48MP Sony IMX582 ప్రైమరీ సెన్సార్,డ్యూయల్ LED ఫ్లాష్‌తో కూడిన డెప్త్ సెన్సార్‌ ఉంటుంది. 
  • సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంది.
  • బ్యాటరీ విషయంలో బెస్ట్ వన్.. 5,000mAh బ్యాటరీ ప్యాక్ 
  • 18W వరకు సపోర్టు చేసే ఫాస్ట్ ఛార్జింగ్‌ యూనిట్ ఉంటుంది. 
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో పనిచేస్తుంది. 
  • వాటర్ రెసిస్టెంన్స్, డస్ట్ రెసిస్టెన్స్ సపోర్టు కోసం.. IP54 రేటింగ్ ఉంది. 

Realme C63:

  • రూ. 10వేల లోపు లభించే మరో స్మార్ట్ ఫోన్.. Realme C63.. దీని స్క్రీన్ 6.67-అంగుళాల HD + ఉంటుంది. 
  • 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్ తో 240Hz టచ్ శాంప్లింగ్ రేట్,625 nits బ్రైట్ నెస్ మంచి ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది. 
  • ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6nm ప్రాసెసర్ తో పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.
  •  గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌లకోసం ఆర్మ్ మాలి-G57 MC2 GPU జత చేశారు. 
  • Realme C63 స్మార్ట్ ఫోన్ లో 8GB LPDDR4x RAM ,128GB UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. 
  • అదనంగా మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 2TB వరకు మెమరీ పెంచుకోవచ్చు. 
  • Realme C63 5000mAh బ్యాటరీతో 10W ఫాప్ట్ ఛార్జ్‌కు సపోర్టు ఉంటుంది. 
  • Realme UI 5.0 పైన Android 14 సిస్టమ్ తో నడుస్తుంది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు 2 సంవత్సరాల OS అప్ డేట్లను అందిస్తుంది. 

Vivo T3 Lite:

  • Vivo T3 Lite 5G స్మా్ర్ట్ ఫోన్.. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 
     
  • 840 nits తో మాగ్జిమ్ బ్రైట్ నెస్ ఉంటుంది. 
  • ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5mm జాక్  ఉంటుంది. 
  • డస్ట్ ,స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌ తో వస్తుంది. 
  • MediaTek డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ తో పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. 
  • గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసంMali-G57 MC2 GPU ఉంటుంది. 
  • స్టోరేజీ విషయానికి వస్తే.. 6GB LPDDR4x RAM ,128GB వరకు eMMC5.1 స్టోరేజ్ ఉంటుంది. 
  • అదనంగా 1TB వరకు మైక్రో SD కార్డ్ స్లాట్‌ ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు. 
  • కెమెరా పరంగా చూస్తే..T3 లైట్ 5G 50MP ప్రైమరీ సెన్సార్  కెమెరా సెటప్ ఉంటుంది. 
  • సెకండరీ 2MP డెప్త్ సెన్సార్‌తో వెనుకకు డ్యూయల్ షూటర్ సెటప్‌ ఉంటుంది. 
  • ముందువైపు 8MP సెల్ఫీ షూటర్ కూడా ఉంటుంది. 

Redmi 13C 5G:

  • Redmi 13C స్మార్ట్ ఫోన్ లో 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంటుంది. 
  • 90Hz రిఫ్రెష్ రేట్ ,450 nits పీక్ బ్రైట్‌నెస్‌ను ఉంటుంది. 
  • ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ MediaTek Helio G85 చిప్‌సెట్ ఉంటుంది.. 
  • గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్ లకోసం Mali-G57 MP2 వరకు జత చేయబడింది.
  • ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 8GB RAM,8GB వర్చువల్ RAM ,256GB వరకు UFS 2.2 స్టోరేజ్‌ ఉంటుంది. 
  • అదనంగా  మైక్రో-SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు. 
  • కెమెరా పరంగా చూస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ లో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP మాక్రో లెన్స్ ,మరొక 2MP లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 
  • సెల్ఫీ ,వీడియో కాలింగ్ అవసరాల కోసం 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.