9 ఓవర్లు.. 9 మెయిడిన్లు.. 8 వికెట్లు.. 10 ఏళ్ల లంక బౌలర్ మ్యాజిక్

9 ఓవర్లు.. 9 మెయిడిన్లు.. 8 వికెట్లు.. 10 ఏళ్ల లంక బౌలర్ మ్యాజిక్

9 ఓవర్లు.. 9 మెయిడిన్లు.. 0 పరుగులు.. 8 వికెట్లు.. నిజానికి ఇలాంటి గణాంకాలు చాలా అరుదు. ఇక్కడ 9 ఓవర్లలో 8 వికెట్లు తీయడం గొప్ప కాకపోవచ్చేమో కానీ, ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా అతడు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసిన తీరు మాత్రం అమోఘం అనే చెప్పుకోవాలి. సెల్వశకరన్ రిషియుధన్ అనే 10 ఏళ్ల లంక యువ స్పిన్నర్ ఈ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 

మొత్తం 9.4 ఓవర్లు వేసిన రిషియుధన్.. 9 ఓవర్లు మెయిడిన్ చేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే 8 వికెట్లు పడగొట్టాడు. ఈ బౌలింగ్ ప్రదర్శనను చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం తన ప్రదర్శనపై మాట్లాడిన ఈ యువ బౌలర్.. ఒకే ఓవర్‌లో 6 బంతులను 6 విభిన్నం రకాలుగా ఎలా వేయాలో తనకు తెలుసని వెల్లడించాడు. ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, క్యారమ్ బాల్, లూప్, ఫ్లాట్ లూప్, ఫాస్ట్ బాల్ అన్నీ అస్త్రాలు తన వద్ద ఉన్నాయని తెలిపాడు.

నాథన్ లియాన్ స్ఫూర్తి 

19 ఏళ్లకే శ్రీలంక జట్టు తరుపున  అరంగ్రేటాం చేయాలని ఉందన్న రిషియుధన్, ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ తనకు స్ఫూర్తి అని తెలిపాడు. 36 ఏళ్ల లయన్ ఆసీస్ తరుపున 500 వికెట్లు తీసిన తొలి టెస్ట్ బౌలర్‌.