ఈ మధ్య చలి బాగా పెరిగిపోయింది. రాత్రి మాత్రమే కాదు.. సాయంత్రం, ఉదయం కూడా విపరీతంగా చలేస్తుంది. పడుకున్నప్పుడు దుప్పటి కప్పుకుని మేనేజ్ చేయొచ్చు. కానీ.. మిగతా టైంలో చలి నుంచి తప్పించుకోవడం ఎలా? అలాంటప్పుడు మోరోవిక్ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ రూమ్ హీటర్ వాడితే సరిపోతుంది. ఇది పోర్టబుల్ సైజులో ఉంటుంది. ఇందులో పీటీసీ సెరామిక్ ఎలిమెంట్ ఉంటుంది. ఇది కేవలం మూడు సెకన్లలోనే వేడెక్కుతుంది. దీనికి ఓవర్ హీట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. టెంపరేచర్ని ఆటోమేటిక్‌గా రెగ్యులేట్ చేసుకుంటుంది.
ఇది ఎయిర్ బ్లోయెర్ హీటర్. వేడి గాలి రూమ్ అంతటా వ్యాపించేలా చేయడానికి ఇందులో ఒక ఫ్యాన్ ఉంటుంది. దీని ఎల్ఈడీ స్క్రీన్‌లో టెంపరేచర్ డిస్ప్లే అవుతుంటుంది. స్క్రీన్ కింది భాగంలో ఉండే బటన్స్‌తో టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది కాంపాక్ట్ డిజైన్‌తో రావడం వల్ల ఎక్కడైనా ఈజీగా వాడుకోవచ్చు. సాకెట్‌కి ప్లగ్ చేసి, స్విచ్ ఆన్ చేస్తే చాలు నిమిషాల్లో రూం వేడెక్కుతుంది.
ధర రూ. 649