పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు చేస్తే ఈ జాబ్సే చేయాలి అబ్బా..

పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు చేస్తే ఈ జాబ్సే చేయాలి అబ్బా..

ఒకప్పుడు అంటే ట్రెడిషనల్ జాబ్స్ వైవే ఎక్కువ మంది మొగ్గు చూపేవారు. అంటే డాక్టర్, లాయర్, ఇంజినీర్, టీచర్ లాంటి ఉద్యోగాలు చేయడానికే ఇష్టపడేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. క్రియేటివ్ జాబ్స్​ చేయడానికి యువత ఆసక్తి చూపిస్తున్నారు. తమలోని క్రియేటివిటీని ప్రపంచానికి పరిచయం చేయాలని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొలదీ క్రియేటివ్ ఫీల్డ్​లో అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. గేమింగ్, ఫిల్మింగ్, స్టోరీ రైటింగ్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, డిజైనింగ్, కంటెంట్​ క్రియేటింగ్ లాంటి క్రియేటివ్ జాబ్స్​కు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల మీకు నచ్చిన పనిచేస్తూనే, పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు బాగా సంపాధించి సెట్టిల్ అవ్వొచ్చు. మంచి కెరీర్ ఉన్న, హై సాలరీ వచ్చే క్రియేటీవ్ జాబ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


 మార్కెటింగ్​ అండ్ అడ్వర్టైజింగ్
ఈ ఫీల్డ్​లో క్రియేటివ్ డైరెక్టర్స్, బ్రాండ్ మేనేజర్స్, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్​లకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఫీల్డ్​లో యావరేజ్​గా నెలకు రూ.60,000 వరకు సాలరీ సంపాధించవచ్చు. సోషల్ మీడియా మేనేజర్, ఎస్​ఈఓ స్పెషలిస్ట్​లు అయితే సంవత్సరానికి రూ.5 లక్షల నుంచి రూ.18 లక్షలు వరకు ప్యాకేజీ ఉంటుంది.

ఫిల్మ్​ అండ్ మీడియా
స్క్రిప్ట్ రైటింగ్, ఫిల్మ్​ డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైనింగ్, యాక్టింగ్, ఎడిటింగ్​ చేసేవారికి నేడు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ ఫీల్డ్​లో మంచి సక్సెస్ సాధించిన వారికి బాగా డబ్బులు వస్తాయి. లేదంటే ఆర్థికంగా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.

ఆర్కిటెక్చర్​ అండ్ ఇంటీరియర్​ డిజైనింగ్​ 
ఆర్కిటెక్ ఇంజినీరింగ్, డ్రాఫ్ట్స్​మెన్, ఇంటీరియర్ డిజైనర్, కాంట్రాక్టర్స్ ఈ ఫీల్డ్​లో ఉంటారు. వీరికి స్టార్టింగ్ సాలరీ సంవత్సరానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. అంతేకాదు.. మంచి పనితనం, బాగా ఎక్స్​పీరియన్స్ ఉన్నవారు గంట కొద్దీ, ప్రాజెక్టుల వారీగా ఎక్కువ డబ్బే తీసుకుంటారు. 

కంటెంట్ క్రియేషన్ 
ఈ ఫీల్డ్​లో రైటర్స్, ఇన్​ఫ్లూయెన్సర్స్, ఎడిటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్​, ఫొటోగ్రాఫర్స్ ఉంటారు. వీళ్లకు సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఎంత పెద్ద సంఖ్యలో సబ్​స్క్రైబర్లు ఉంటారో, అంత పెద్ద ఎత్తున వారికి ఆదాయం వస్తుంది.

ఇన్​స్టాగ్రామ్, యూట్యూబ్​, ఫేస్​బుక్​ లాంటి సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో పనిచేసే సాధారణ కంటెంట్ క్రియేటర్లు సంవత్సరానికి సుమారుగా రూ.1 లక్ష నుంచి రూ.20 లక్షల వరకు ఎర్న్ చేస్తుంటారు. పెద్దపెద్ద ఇన్​ఫ్లూయెన్సర్లు అయితే కోట్లాది రూపాయలు కూడా సంపాదిస్తుంటారు.

గేమింగ్
నేడు గేమింగ్ డిజైనర్లు, యానిమేటర్లు, స్టోరీ టెల్లర్​లకు మంచి డిమాండ్ ఉంది. సాధారణ గేమ్​ డెవలపర్లు​ సంవత్సరానికి సుమారుగా రూ.4 లక్షలు సంపాదిస్తూ ఉంటారు. కానీ మంచి స్కిల్, ఎక్స్​పీరియన్స్ ఉన్నవారు ఇంకా ఎక్కువగానే సంపాదిస్తూ ఉంటారు.
 

ALSO READ :- సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం టూర్ ఖరారు