రెగ్యులర్ వాచీలకు బదులుగా స్మార్ట్ వాచ్‌లు ధరించడం లేటెస్ట్ ట్రెండ్. స్మార్ట్‌వాచ్‌లు అనగానే చాలా ఖరీదైనవే అనుకుంటారు. కానీ, తక్కువ బడ్జెట్లో.. అంటే రెండు, మూడు వేల రూపాయల్లోపే వచ్చే స్మార్ట్‌వాచ్‌లు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిలో బ్రాండెడ్ కంపెనీల వాచ్‌లు కూడా ఉండటం విశేషం. స్టైలిష్ లుక్‌ను అందించే స్మార్ట్ వాచ్‌లంటే ఆసక్తి ఉండి, తక్కువ ధరలో కావాలనుకునే వాళ్లు వీటిని ట్రై చేయొచ్చు.
ఎమ్ఐ హెచ్ఆర్ఎక్స్
షావోమి సంస్థ నుంచి రెండు స్మార్ట్ వాచ్‌లు బడ్జెట్లో దొరుకుతున్నాయి. వాటిలో ‘ఎమ్ఐ హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్’ ఒకటి. ఇది బేసిక్ మోడల్. ధర సుమారు పన్నెండు వందల రూపాయలు. ఓఎల్ఈడీ డిస్ప్లే, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చిన మరో మోడల్‘ఎమ్ఐ బ్యాండ్3’. దీని ధర సుమారు రెండు వేల రూపాయలు. హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్, స్టెప్ ట్రాకింగ్, యాక్టివిటీ ట్రాకర్ వంటి ఫీచర్లున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైళ్లతో కనెక్ట్ చేసుకోవచ్చు.
ఆనర్ బ్యాండ్ 4
ఆనర్ సంస్థ నుంచి విడుదలైన ‘ఆనర్ బ్యాండ్ 4’ బడ్జెట్స్మార్ట్ వాచ్. మూడు వేరియంట్లలో లభిస్తున్న ఇది అమోల్డ్ ఫుల్ కలర్ డిస్ప్లే, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. కేలరీ బర్న్ కౌంట్, స్లీప్, స్టెప్, డిస్టెన్స్ కౌంట్ వంటి ఫీచర్లున్నాయి. కాల్ మెసేజ్ నోటిఫికేషన్లు అందిస్తుంది. ధర సుమారు రెండున్నర వేల రూపాయలు.
నాయిస్ కలర్‌ఫిట్
‘నాయిస్ కలర్‌ఫిట్ స్మార్ట్ వాచీ’ తక్కువ ధరలో అందుబాటులో ఉంది. మూడు రంగుల్లో దొరుకుతుంది. ఏడు రోజుల బ్యాటరీ కెపాసిటీ, బిగ్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. ఔట్‌డోర్, ఇన్డోర్ ఫిట్నెస్ ట్రాకర్‌గా పని చేస్తుంది. ధర సుమారు మూడు వేల రూపాయలు.
రాన్
ఫ్యాషన్ బ్రాండ్ ‘రాన్’ నుంచి తక్కువ ధరలోనే స్మార్ట్‌వాచ్‌లు లభిస్తున్నాయి. ఓఎల్ఈడీ డిస్ప్లే, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉన్నాయి. స్లీప్, స్టెప్స్ ట్రాకింగ్, కాల్, ఎస్ఎమ్ఎస్, ఈమెయిల్, వాట్సాప్ వంటివి చెక్ చేసుకోవచ్చు. ఏడాది వారెంటీతో దాదాపు ఎనిమిది వందల రూపాయల నుంచే ఇవి ప్రారంభమవుతున్నాయి.