Good Food: పాలిచ్చే తల్లులకు బెస్ట్​ ఫుడ్​ ఇదే.. ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా..!

Good Food:  పాలిచ్చే తల్లులకు బెస్ట్​ ఫుడ్​ ఇదే.. ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా..!

తామరగింజలను పూల్​ మఖానా అంటారు.  వీటిలో పాల గ్రంథులను ఉత్పత్తి చేసే లక్షణాలు ఎక్కువుగా ఉంటాయి.  పూర్వకాలంలోబాలింతలకు రోజు వీటి పొడిని అన్నం తినేటప్పుడుకు ఒక ముద్ద పెట్టేవారు.  కాని రాను రాను కాలం మారడంతో తామరగింజల ఫుడ్​ను మర్చిపోయారు. ఇప్పుడు బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకుంటే.. పసిపిల్లలకు పుష్కలంగా పాలు ఇవ్వగలుగుతారు. పూల్​ మఖానాతో అచ్వానీ అనే ఫుడ్​ ఐటమ్​ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. .. 

పూల్​ మఖానాతో అచ్వానీ తయారీకి కావలసిన పదార్దాలు

  • బెల్లం – 200 గ్రాములు
  • ఫూల్​ మఖానా – 50 గ్రాములు
  • బాదం, జీడిపప్పు తరుగు, ఎండుద్రాక్ష ‌‌ – ఒక్కో టేబుల్ స్పూన్ 
  • గసగసాలు, చరోలి (మొర్రి పండు గింజలు) – ఒక్కో టేబుల్ స్పూన్ 
  • పుచ్చకాయ గింజలు, వెన్న – ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున
  • ఎండుకొబ్బరి – అర కప్పు
  • ఎడిబుల్ గమ్, వాము – ఒక టీస్పూన్ 
  • గోధుమ పిండి – ఒకటిన్నర టేబుల్ స్పూన్
  • జాజికాయ – పావు టీస్పూన్
  • మిరియాలు, శొంఠి పొడి, పసుపు – ఒక్కోటి అర టీస్పూన్ 
  • దాల్చిన చెక్క – చిన్న ముక్క
  • యాలకులు – నాలుగు
  • నీళ్లు – సరిపడా

తయారీ విధానం: ఒక పాత్రలో బెల్లం వేసి నీళ్లు పోసి కరిగించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి పక్కన పెట్టాలి. మిక్సీజార్​లో యాలకులు, మిరియాలు, వాము, దాల్చిన చెక్క, జాజికాయ, శొంఠిపొడి, పసుపు వేసి గ్రైండ్ చేయాలి. పాన్​లో నెయ్యి వేడి చేసి అందులో మఖానా వేసి వేగించాలి. అదే పాన్​లో బాదం, జీడిపప్పు తరుగు, ఎండుద్రాక్ష, చరోలి (మొర్రి పండు గింజలు), పుచ్చకాయ గింజలు వేసి వేగించాలి. అవి వేగాక అందులో కొబ్బరి తురుము కూడా వేయాలి. 

ఆ తర్వాత పాన్​లో వెన్న వేడి చేసి అందులో గోధుమపిండి వేసి కలపాలి. తర్వాత ఎడిబుల్ గమ్, గ్రైండ్ చేసుకున్న పొడి మిశ్రమం, గసగసాలు వేసి కలపాలి. అందులో బెల్లం పాకం నీళ్లు పోయాలి. ఆ మిశ్రమంలో వేగించి పెట్టుకున్న మఖానాతోపాటు మిగిలిన డ్రైఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమం దగ్గరపడ్డాక సర్వ్​ చేయడమే. దీన్ని గుడ్​ కీ పాట్​, హరిరా అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఇమ్యూనిటీ పెరగడానికి తోడ్పడుతుంది. అంతేకాదు.. పాలిచ్చే తల్లులకు మరీ మంచిదట!

–వెలుగు,లైఫ్​–