
కిచెన్లో అనేక స్పైసెస్, పప్పు దినుసుల డబ్బాలు ఉంటాయి. ఒక్కోసారి ఏ డబ్బాలో ఏముందో మర్చిపోయి ఒకదానికి బదులు మరో డబ్బా తీస్తుంటాం. అలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదంటే.. ఇలాంటి ప్రింటర్‌తో లేబుల్స్ ప్రింట్ చేసి డబ్బాలపై అతికిస్తే సరిపోతుంది.
దీన్ని ఆర్ఐఐటెక్ అనే కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీన్ని బ్లూటూత్ ద్వారా మొబైల్కి కనెక్ట్ చేసుకుని యాప్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌తోపాటు ఐఓఎస్ డివైజ్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇంక్ నింపాల్సిన అవసరం లేదు. థర్మల్ టెక్నాలజీతో పనిచేస్తుంది.
ఇంక్‌జెట్ ప్రింటర్‌లతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో ప్రింట్ చేసుకోవచ్చు. ఫుడ్ స్టోరేజీ బాక్స్లతోపాటు బట్టల కప్‌బోర్డ్స్, ఫ్రిడ్జ్లో వాడే స్టోరేజీ కంటైనర్స్, ఆఫీస్‌లో ఫైల్స్ మీద అతికించే లేబుల్స్ని దీంతో ప్రింట్ చేసుకోవచ్చు.
ఇందులో 1200mAh బ్యాటరీ ఉంటుంది. ఫుల్ చార్జ్ చేస్తే.. 4 గంటలపాటు పనిచేస్తుంది. కనీసం వారం పాటు స్టాండ్‌బైలో ఉంటుంది. దీంతో పాటు ప్యాక్‌లో 12 x 40 ఎంఎం లేబుల్ టేప్ కూడా వస్తుంది.