చలికాలంలో పిల్లలకు ఈ ఫుడ్ పెట్టండి

చలికాలంలో పిల్లలకు ఈ ఫుడ్ పెట్టండి

వింటర్​లో ఫుడ్ తినాలంటే కాస్త కష్టమే. ఏది వండినా కాసేపటికే చల్లారిపోతుంది. చల్లగా తినాలంటే గొంతు దిగదు. కొందరికైతే ఆకలి కూడా తెలియదు ఆ చలికి. పెద్దల పరిస్థితే ఇలా ఉంటే మరి పిల్లల పరిస్థితేంటి? మామూలుగానే పిల్లలు ఒక పట్టాన ఏది తినరు. వాళ్లకు నచ్చింది పెడితేనే తింటారు. అలాగని వేడి వేడి దోశలు, ఇడ్లీలు, శ్నాక్స్​ వంటివి చేసినా, వాళ్లు తినబోయేసరికి అవి కూడా చల్లారిపోతాయి. దాంతో సగం తిని వదిలేస్తారు. ఇక జ్యూస్​లు, కూల్​ డ్రింక్​లు అంటారా? వింటర్​లో వాటి జోలికి అస్సలు పోకూడదు. మరి ఏం తినిపించాలంటే.... 

 చలికాలంలో  పిల్లల్ని గొంతు గరగర, జలుబు బాగా ఇబ్బంది పెడతాయి. వాటి నుంచి కాపాడుకోవాలంటే వెజిటబుల్ సూప్స్​ తాగించాలి. ఒక కప్పు టొమాటో సూప్​ తాగినా చాలు రిఫ్రెష్​మెంట్, ఎనర్జీ వస్తాయి. ఇందులో ఉండే విటమిన్–సి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇదే కాకుండా పాలకూర, బ్రకోలి, మష్రూమ్, బీట్​రూట్ సూప్​లు కూడా తాగొచ్చు. వీటన్నింటిలో ఫైబర్​ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు మినరల్స్​, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇలా పిల్లలకు వెజిటబుల్స్ అలవాటు చేయొచ్చు కూడా.   చిలగడ దుంపలు కూడా చలికాలంలో పిల్లలకు పెట్టాల్సిన ఫుడ్ ఐటమ్. వీటిలో పొటాషియం, ఫైబర్​లు ఎక్కువ. ఇందులో ఉండే బీటా కెరోటిన్ రోజంతా శక్తినిస్తుంది.   నట్స్​, డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల బాడీలో వెచ్చదనం వస్తుంది. వీటిలో మైక్రో న్యూట్రియెంట్స్​, విటమిన్స్​ ఎక్కువ. జీడిపప్పు, అంజీర్​, బాదం, పిస్తా, ఖర్జూరం, వాల్​నట్స్, పల్లీలు​ తినడం వల్ల మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. 

వింటర్​లో వెచ్చదనాన్నిచ్చే మరో ఫుడ్ బెల్లం. ఇది దగ్గు, జలుబు, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. అన్నం తిన్నాక, చిన్న బెల్లం ముక్క నోట్లో పెట్టుకుంటే డైజెషన్​కి మంచిది. పాయసం వంటివి చేసుకున్నప్పుడు చక్కెర బదులు బెల్లం వేస్తే చాలా మంచిది.  ఫ్రూట్స్​లో కివీ, జామ, ఆరెంజ్​లు తింటే బెటర్. వీటిలో విటమిన్​ – సి  పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. వీటిని క్యాండీలుగా చేసుకుని కూడా తినొచ్చు.  కోడిగుడ్లు తింటే ప్రొటీన్ బాగా అందుతుంది. ఈ సీజన్​లో మంచి న్యూట్రిషనల్ ఫుడ్ కోడిగుడ్డు. దీన్ని బ్రెడ్ ఆమ్లెట్​, ఫ్రైడ్ వెజిటబుల్ ఎగ్స్, క్యారెట్, బీట్​రూట్​లతో కలిపి తినొచ్చు. ఈ వెజిటబుల్స్​ని హల్వా, ఖీర్, వేపుళ్లలో కూడా వాడొచ్చు. వీటిలో విటమిన్​ – ఎ ఉంటుంది. అది పిల్లలకు ఇన్​ఫెక్షన్స్, అలర్జీలు రాకుండా అడ్డుకుంటుంది. డైజెషన్​ని కూడా మెరుగుపరుస్తుంది.  జొన్న, రాగి, సజ్జ, మొక్కజొన్నలతో పాన్​ కేక్​లు లేదా రొట్టెలు తినొచ్చు. వీటిని పెరుగు, నెయ్యి, బెల్లం, పప్పుతో కలిపి పిల్లలకు పెట్టొచ్చు. ఇలా కాకపోతే చపాతీనే పిజ్జాలా చేసి పెట్టొచ్చు. పిజ్జా బేస్​ కోసం న్యూట్రిషనల్​ ఫుడ్ ఐటమ్స్​ వాడాలి.  ఇలాంటివి తినిపిస్తే వింటర్​లో ఇబ్బంది పెట్టే జలుబు, దగ్గు, జ్వరాలు రాకుండా చేస్తాయి. ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి.