ఆఫీసుల్లో.. కాలేజీల్లో బ్రెయిన్ వాష్ చేయాలి అనే పదం వింటుంటాం. బ్రెయిన్ అంటే మెదడు అని అందరికీ తెలిసినదే. అయితే చేయకూడని పనులు.. అసంబద్దంగా వాదించడం లాంటివి చేస్తే మెదడు సరిగా పనిచేయడం లేదా అనే అర్దం వచ్చేలా బ్రెయిన్ వాష్ చేయాలంటుంటారు. వినడం, చూడడం, అర్థం చేసుకోవడం, నడవడం, కదలడం, ఆలోచించడం ఇలా అన్ని పనులు మన మెదడు ద్వారానే జరుగుతాయి. మెదడు ఆరోగ్యం బాగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. . . .
మెదడు పని చురుకుగా ఉన్నవారే.. చలాకీగా ఉంటారు. ఎప్పుడు ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఇలా అన్నీ మన మెదడు నుండే పనులు జరుగుతాయి. కొన్ని కొన్ని సార్లు మనం చిన్న విషయాలపై కూడా పెద్దగా స్పందించడం ప్రారంభిస్తాం. అధే విధంగా ఇంట్లో వాళ్ల మీద ఒక్కొక్క సారి కోప్పడతాం.. దీనికి కారణం మనం ఒత్తిడికి గురైనప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి.. ఒత్తిడి వలనో మరి ఏ ఇతర కారణాల వల్లనో మన మెదడు లయ చెదిరిపోయినప్పుడు ఇది తరచుగా జరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే.. ఇవి మన జీవితాన్ని ట్రాక్‌లో ఉంచడమే కాకుండా మన ఆలోచనా శక్తి, తార్కిక శక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి.
పసుపు, అల్లం : ఈ రెండింటినీ మీ ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా ప్రతిరోజూ 1 నుండి 2 గ్రాముల (చిటికెడు) పసుపు తీసుకోండి. పసుపు మెదడుకు చాలా మంచిది. రోజు కొంచె చిన్న అల్లం ముక్క తినడం వల్ల మన మెదడుకు చాలా మేలు చేస్తుంది.
మాంసాహారం: మాంసాహారం తినడం వల్ల మన శరీరానికి తగిన ప్రొటీన్లు అందుతాయి. మెదడు పని తీరు చురుగ్గా ఉండాలంటే గుడ్లు తినొచ్చు. వీటిలో విటమిన్ బి అధికంగా ఉంటాయి.
నూనె లేదా నెయ్యి : ఆవాలు, కనోలా నూనె మంచివి.. ఎందుకంటే వీటిలో క్రొవ్వు పదార్ధాలు తక్కువగా ఉంటాయి. ఇవి మెదడుకు కూడా మేలు చేస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే చాలా బెటర్
నెయ్యి కూడా చాలా మంచిది. వీటిలో కూడా అనేక రకాల ప్రొటీన్స్ ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది.
పచ్చని ఆకు కూరలు: ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వాటిని సరిగ్గా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆకుపచ్చ కూరగాయలలో టేప్‌వార్మ్ గుడ్లు ఉండవచ్చు. దీని కారణంగా సంక్రమణ వ్యాధులు సంభవిస్తాయి. వీటి వల్ల ఇన్ఫెక్షన్ మెదడుకు చేరినప్పుడు అపస్మారక స్థితి కూడా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఆకు కూరలను బాగా శుభ్రం చేసి ఉడికించిన తర్వాత తినడం మంచిది.
చక్కెర కంటే బెల్లం మంచిది : చక్కెరలో తీపి శాతం ఎక్కువగా ఉంటుంది కనుక దీనికి బదులుగా బెల్లం మంచిది. బెల్లంలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మెదడుకి చాలా మంచిది.
గుమ్మడి గింజలు: మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే గుమ్మడి గింజలు తినండి వీటిలో యాంటీ ఆక్సీడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
తగినంత నిద్ర : ప్రతిరోజూ 7 నుండి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. ఎక్కువ సేపు నిద్రించడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అస్తిరమైన నిద్రతో మానసిక స్తితి దెబ్బతింటుంది. ఇవి మెదడుపై ప్రభావం చూపుతుంది.