మిడ్‌‌‌‌‌‌‌‌, స్మాల్‌‌‌‌‌‌‌‌ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌లోకి భారీగా పెట్టుబడులు

న్యూఢిల్లీ: మిడ్ క్యాప్‌‌‌‌‌‌‌‌, స్మాల్‌‌‌‌‌‌‌‌ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌‌‌‌‌‌‌‌లలోకి భారీగా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు వస్తున్నాయి. కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిడ్‌‌‌‌‌‌‌‌ క్యాప్ కేటగిరీ స్కీమ్‌‌‌‌‌‌‌‌లలోకి రూ.5,093 కోట్లు రాగా, స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ కేటగిరీలోకి రూ.4,667 కోట్లు వచ్చాయి. 

మొత్తంగా రూ.41,156 కోట్లను మ్యూచువల్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్ డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆకర్షించగలిగాయి. అంతకు ముందు నెలతో పోలిస్తే ఇది 14 శాతం ఎక్కువ. సిప్‌‌‌‌‌‌‌‌  కింద రూ.26,459 కోట్లు మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాయి. 

సిప్‌‌‌‌‌‌‌‌ కింద ఫండ్స్ మేనేజ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న అసెట్స్ విలువ (ఏయూఎం) రూ.13.63 లక్షల కోట్లకు చేరుకుంది.  మొత్తం ఇండస్ట్రీ  ఏయూఎం రూ.66.93 లక్షల కోట్లుగా నమోదైంది.