వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ములుగు జిల్లా రామప్ప లేక్ వద్ద గల హరిత హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న రంజిత్‌కుమార్ ‘బెస్ట్ మేనేజర్ ఇన్ హరిత హోటల్’ అవార్డుకు ఎంపికయ్యారు.
ALSO READ: ముత్తిరెడ్డి గట్టిగా ప్రయత్నిస్తే డివిజన్ వచ్చేది: లింగయ్య
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ నిఖిల, ఎండి మనోహర్‌రావు చేతుల మీదుగా రంజిత్ అవార్డును అందుకున్నారు.