Men Special : సూపర్ హెయిర్ కట్స్.. అందరూ మిమ్మల్నే చూస్తారు.. ట్రై చేయండి ఓ సారి..!

Men Special : సూపర్ హెయిర్ కట్స్.. అందరూ మిమ్మల్నే చూస్తారు.. ట్రై చేయండి ఓ సారి..!

సూపర్ హెయిర్ కట్స్

'ప్రేమదేశం  సినిమా వచ్చిన కొత్తలో.... ఆ సినిమా హీరో అబ్బాస్ హెయిర్ స్టయిల్ కోసం సెలూన్ల ముందు క్యూలు కట్టేవాళ్లు అబ్బాయిలు. ఎందుకంటే అప్పట్లో జుట్టు ఎంత ఎక్కువగా ఉంటే అంత క్రేజ్. పొరపాటున తగ్గించుకున్నా సరే... డిప్ప కటింగ్' అని ఎగతాళి చేసేవాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రజెంట్ జట్టు ఎంత తక్కువ ఉంటే అంత క్రేజ్! సైడ్ మొత్తం ట్రిమ్ చేస్తారు. తల పైన మాత్రం కాస్త జుట్టు ఉంచుతున్నారు.. లేదంటే ఏ సినిమా హీరోనో, క్రికెట్ స్టార్‌‌నో ఫాలో అవుతున్నారు. రింగురింగుల జుట్టో, సిల్కీ హెయిరో.. నచ్చినట్టుగా మార్చేసుకుంటూ ఇదే ట్రెండ్ అంటున్నారు. మరి అలాంటి కొన్ని హెయిర్ స్టైల్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

మిడ్-లెంత్ మెస్సీ 

ఈ రకం హెయిర్ కట్ ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. సింపుల్‌గా సూపర్‌‌గా కనిపించాలంటే ఈ హెయిర్ స్టైల్ బెస్ట్ ఆప్సన్

ఇండక్షన్ కట్

బాజీరావ్ మస్తానీ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హెయిర్ స్టయిల్ చూసే ఉంటారు. తలపైన చర్మం కనబడేలా ట్రీమ్ చేస్తారు. గల్లీ బాయ్ లుక్స్ కావాలనుకునే వాళ్లు ఈ ఇండక్షన్ కట్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

క్రూ కట్..

రెండో ప్రపంచయుద్ధ సమయంలో క్రూ కట్ చాలా ఫేమస్ 1970లో దానికి డిమాండ్ తగ్గి, లాంగ్ హెయిర్ స్టయిల్స్ కి డిమాండ్ పెరిగింది. అయితే ఆ తర్వాత 1980లో  క్రూ కట్ మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక మనదేశంలో ఈ మధ్య బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా క్రూ కట్ కి ఫిదా అయిపోయారు. ఇది చూడ్డానికి కొంచెం ఆర్మీలుక్ తరహాలో ఉంటుంది. సైడ్స్ మొత్తం ట్రిమ్ చేసి, టాప్‌లో  సైక్స్ లా మెయింటైన్ చేయొచ్చు లేదా తగ్గించొచ్చు

Also Read :- ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా

క్లాసిక్ స్ట్రయిట్ న్యూ

స్టయిట్ జుట్టు ఉన్న వారికి చాలా హెయిర్ స్టైల్స్ ఉంటాయి. ఈ రకం జుట్టుతో వివిధ రకాల కట్‌లు చేసుకోవచ్చు. అయితే ట్రెండీగా, కూల్ గా ఉండే ఈ క్లాసిక్ కట్ ఉద్యోగం చేసే వాళ్లకి బాగుంటుంది. అమాయకంగా, ఆకర్షణీయంగా కనిపించడమే దీని స్పెషాలిటీ.

అండర్‌‌ కట్

తెలకి రెండు వైపులా ట్రీమ్ చేసి జుట్టును షార్ట్ లెంత్‌లో ఉంచడమే అండర్‌‌ కట్ 1920, 30లలో ఈ అండర్‌‌ కట్ ఫుల్ ఫేమస్. తర్వాత నెమ్మదిగా ఈ స్టయిల్‌ సెలబ్రిటీలను తాకింది. ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హమ్ అండర్‌‌ కట్ లోకి మారాక ప్రపంచవ్యాప్తంగా ఈ స్టయిల్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత విరాట్ కోహ్లి, ఫుట్ బాల్ స్టార్ క్రిస్లెనో రోనాల్డోలు అండర్కట్ కు అభిమానులు ఫిదా అయిపోయారు.

మెన్స్ అండర్కట్ ఫేడ్

సైడ్ షేన్‌తో పాటుగా ఉండే ఈ అండర్ కట్ హెయిర్ స్టైల్స్ ప్రస్తుతం ఎక్కువ మంది యువకులు పాలో అవుతున్నారు. హెయిర్ లైన్ నుంచి లైట్ గా షేవ్ చేస్తూ. పై భాగంలో పొడవుగా వదిలిపెడతారు ఇందులో చాలా రకాలు ఉన్నాయి.

మెస్ట్ అప్ పొంపాడోర్

ఈ స్టైల్ కట్ లో మాస్టర్ కూల్‌గా మెరిసిపోవచ్చు చాలా కూల్‌గా ఉండే ఈ మోడల్ కట్ అండర్ కట్ మోడల్స్ లో ఒకటి నీట్‌గా దువ్వకుండా మెస్ట్ గా ఉంచడమే దీని స్పెషాలిటీ. దీనిలో రిలాక్స్ పొంపాడోర్ కూడా ఒక మోడల్.