ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇటీవల లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టుతో జేమ్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 188 టెస్టులు ఆడిన అండర్సన్ మొత్తం 704 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో అండర్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ 708 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి తర్వాతి స్థానం అండర్సన్‌దే. అయితే, ముత్తయ్య, వార్న్ ఇద్దరూ స్పిన్నర్లే. పేసర్ల పరంగా చూస్తే అండర్సన్‌దే అగ్రస్థానం. ఈ నేపథ్యంలో అతని సుదీర్ఘ కెరీర్‌లో కొన్ని అద్భుత క్షణాలు చూద్దాం..
2003, మేలో జింబాబ్వేపై ఆండర్సన్ టెస్ట్ అరంగేట్రం
2003 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శన
2003లో వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి ఇంగ్లిష్ ఆటగాడిగా ఘనత
2010-11లో ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ గెలవడంలో అండర్సన్ కీలక పాత్ర
2012లో భారత్ గడ్డపై ఇంగ్లండ్ జట్టు చారిత్రాత్మక సిరీస్ విజయం
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌పై 300వ టెస్టు వికెట్
వికెట్ నం.400.. ఈ మైలురాయిని చేరుకున్న మొదటి ఇంగ్లీష్ బౌలర్
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా భారత్‌పై అండర్సన్ హాఫ్ సెంచరీ
2015 ప్రపంచ కప్ ప్రచారం తర్వాత వన్డేలకు అండర్సన్ దూరం
2017లో లార్డ్స్‌లో మరో మైలురాయి.. 500వ టెస్టు వికెట్
తన సహచరుడు స్టువర్ట్ బ్రాడ్‌తో అండర్సన్
2018లో అండర్సన్.. గ్లెన్ మెక్‌గ్రాత్‌ను అధిగమించి టెస్ట్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్‌గా ఘనత
పాకిస్థాన్ ఆటగాడు అజర్ అలీ.. అండర్సన్‌కి 600వ టెస్టు వికెట్
భారత్‌పై అండర్సన్ 700వ టెస్ట్ వికెట్ (బ్యాటర్: కుల్‌దీప్ యాదవ్)
తన 42వ పుట్టినరోజుకు కొద్ది రోజుల ముందు అంతర్జాతీయ క్రికెట్‌కు అండర్సన్ వీడ్కోలు
704 టెస్టు వికెట్లతో కెరీర్ ముగింపు..