మీరు హాయిగా నిద్రపోవాలంటే..నాయిస్ ప్లేయర్ వాడండి

మీరు హాయిగా నిద్రపోవాలంటే..నాయిస్ ప్లేయర్ వాడండి

పెరిగిన టెక్నాలజీ, బిజీ లైఫ్​ లాంటి కారణాలతో కొన్ని లక్షలమందికి నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. అలాంటివాళ్లకు బాగా ఉపయోగపడే గాడ్జెట్​ ఇది. కార్వాన్​ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ గాడ్జెట్​ బాగా నిద్ర పట్టేందుకు సాయపడే కొన్ని రకాల శబ్దాలను వినిపిస్తుంది. వాటివల్ల ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇది 20 రకాల సౌండ్స్​ ప్రీలోడెడ్​గా వస్తాయి. 

పోర్టబుల్​ డిజైన్​తో రావడం వల్ల ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. సెట్​ చేసుకున్నట్టుగా 15/30/60 నిమిషాల తర్వాత ఆటోమెటిక్​గా ఆఫ్​ అయ్యేలా దీన్ని ప్రోగ్రామ్ చేశారు. ఇందులో రీచార్జబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఫుల్​ చార్జ్​ చేస్తే 8 గంటల వరకు పనిచేస్తుంది. ఇలాంటి సౌండ్స్​ని ఫోన్​లో కూడా వినొచ్చు. కానీ.. పడుకునేముందు బ్లూ లైట్​ స్క్రీన్​కి దూరంగా ఉండాలి అనుకునేవాళ్ల కోసం దీన్ని డిజైన్​ చేశారు. 

ధర : రూ. 1,290