
- తెలంగాణ చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులలో భాగంగా 2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు నిర్మితమైన సినిమాల్లో ప్రతి ఏడాది ఒక మూవీకి ఉత్తమ చలన చిత్ర అవార్డును అందించనున్నట్టు తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. 2014 నుంచి 2023 వరకు గత ప్రభుత్వం ఫిలిం అవార్డులను ప్రకటించలేదని, ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది నిర్మితమైన ఉత్తమ చలన చిత్రానికి అవార్డును అందించాలని నిర్ణయించినట్టు చెప్పారు.