ఖమ్మం టౌన్, వెలుగు : జేఈఈ మెయిన్స్ బీఆర్క్ ప్లానింగ్ లో హార్వెస్ట్ కు అత్యుత్తమ ఫలితాలు వచ్చినట్లు ఆ విద్యాసంస్థల కరస్పాండెంట్ పీ.రవి మారుత్ తెలిపారు. 50 మంది స్టూడెంట్లు ఎగ్జామ్ రాసినట్లు తెలిపారు. సత్యథాగత్(99.63), జి.చిన్మయి(98.98), ఇ.కౌశిక్(97.97), బి.కార్తీక (97.52), ఎ. రాహుల్ పృధ్వి(97.13), జి.చంద్రశేఖర్ రెడ్డి(97), ఆర్.అమూల్య(96.86), వై.జీవని(94)
వి.శ్రీకాంత్(92.3), ఎస్.కరుణ్ శేఖర్(90.63), పి.హేమశ్రీ(90.27) ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్ ను గురువారం హార్వెస్ట్ కళాశాల కరస్పాండెంట్ పీ.రవి మారుత్, ప్రిన్సిపల్ ఆర్.పార్వతి రెడ్డి అభినందించారు.