అబ్డామినల్ ఎక్సర్సైజ్లు చేయడానికి కొంతమంది రోలర్లను వాడుతుంటారు. అలాంటివాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. లైఫ్‌లాంగ్ అనే కంపెనీ ఈ అబ్స్ రోలర్‌ని తీసుకొచ్చింది. డ్యూయల్ వీల్ డిజైన్తో తయారుచేయడం వల్ల స్మూత్ మోషన్స్ ఉంటాయి. అబ్స్, ఆర్మ్స్, చెస్ట్, షోల్డర్స్, బ్యాక్ ఎక్సర్సైజ్లకు ఇది బెస్ట్ చాయిస్.
ఇందులో స్పెషాలిటీ ఏంటంటే.. దీనికి ప్రత్యేకంగా ఒక ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. అందులో ఎంతసేపటి నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నామో చూసుకోవచ్చు. టార్గెట్ పెట్టుకుని వర్కవుట్స్ చేసేవాళ్లకు ఈ టైమర్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఫోన్ హోల్డర్ కూడా ఉంటుంది. అందులో ఫోన్ పెట్టుకుని వీడియోలు చూస్తూ.. ఎక్సర్సైజ్ చేయొచ్చు.