- ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల లీడర్లకు ఆత్మీయ వీడ్కోలు
వరంగల్, వెలుగు: స్థానిక సంస్థల లీడర్ల పదవీ కాలం ముగియడంతో ఉమ్మడి జిల్లాలో అధికారులు గురువారం ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. వరంగల్లో జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడారు. ఉత్తమ సేవచేసే గుణం ఉంటే రాజకీయ అవకాశాలు దక్కుతాయని అన్నారు. సీఈఓ రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన వీడ్కోలు సమావేశంలో వరంగల్, హనుమకొండ అడిషనల్ కలెక్టర్లు సంధ్యారాణి, రాధిక గుప్తా.. సభ్యులందరిని సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, అగ్రికల్చర్ ఏడీ ఉషాదయాల్, డీఈఓ వాసంతి పాల్గొన్నారు.
అభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర కీలకం : కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి అర్బన్/ జనగామ : అభివృద్ధిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం జడ్పీ సీఈఓ విజయలక్ష్మి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ ఆఫీస్లో జడ్పీటీసీలు, కో ఆప్షన్ సభ్యుల ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. వారి సేవలను కొనియాడి, సన్మానించారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, వైస్ చైర్పర్సన్ కల్లెపు శోభారాణి పాల్గొన్నారు. జనగామ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో జడ్పీ చైర్ పర్సన్ గిరబోయిన భాగ్మలక్ష్మి అధ్యతన సమావేశం నిర్వహించగా.. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అడిషనల్ కలెక్టర్ పింకేష్ హాజరై జడ్పీటీసీలను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ అనిల్ కుమార్, డిప్యూటీ సీఈఓ సరిత, స్టాఫ్ పాల్గొన్నారు.
ALSO Read : గంజాయితో జీవితాలను నాశనం చేసుకోవద్దు : ఎస్పీ కిరణ్ ఖరే
పర్వతగిరి(సంగెం) : సంగెం, గీసుగొండ మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీను గురువారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హనుమకొండలోని ఆయన నివాసంలో సన్మానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ పోరాడాలని సూచించారు.