మీ బడ్జెట్‌కు సరిపోయే ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? రూ. 10వేల లోపు మీకు తగిన డివైజ్ లకోసం ఎదురు చూస్తున్నారా.. అద్బుతమైన డిస్ ప్లేలు, పవర్ ఫుల్ ప్రాసెసర్లు, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్, మంచి పనితీరు, ఆకట్టుకునే కెమెరా ఫోన్లు. బ్యాంక్ ఆఫర్లతో తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
iQOO Z9 Lite
iQOO Z9 Lite స్మార్ట్ ఫోన్ లో అద్బుతమైన ఫీచర్లు ఉన్నాయి. 90Hz రిఫ్రెష్ రేట్, 840 nits గరిష్ట బ్రైట్ నెస్ 6.56-అంగుళాల HD+ డిస్‌ప్లేను ఉంటుంది. ఇది MediaTek డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో 6GB RAM , 128GB స్టోరేజీతో 1TB వరకు స్టోరేజీని విస్తరించుకోవచ్చు.
ఫోన్ Funtouch OS 14 (Android 14)పై నడుస్తుంది , 2 యేళ్ళ Android నవీకరణలను , 3 యేళ్ళ సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ,8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ,IP64 రేటింగ్‌తో, ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కూడా అందిస్తుంది.
Moto G45 5G
Moto G45 5G డివైజ్ లో కూడా మంచి ఫీచర్లు ఉన్నాయి. 6.45-అంగుళాల HD+ డిస్‌ప్లే (120Hz రిఫ్రెష్ రేట్)తో వస్తుంది, Qualcomm Snapdragon 6s Gen 3 చిప్, 8GB RAM , 128GB స్టోరేజీ ఉంటుంది.. కావాలంటే స్టోరేజీని విస్తరించుకోవచ్చు. ఇది Android 14 వెర్షన్ తో నడుస్తుంది.
యేడాదిపాటు OS అప్‌డేట్‌లు, 3 యేల్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ ఉంటుంది. 48MP ప్రైమరీ కెమెరా డెప్త్ సెన్సార్‌తో జోడించబడి ఉంటుంది. 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.