హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బెస్టు టీచర్ అవార్డులను గ్రేడ్ 2 లాంగ్వేజ్ పండిట్లకూ ఇవ్వాలని ఆర్‌యూపీపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సి.జగదీశ్, ఎస్.నర్సింహులు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, ఎమ్మెల్సీ దేశ్ పతి శ్రీనివాస్ లను ఆర్‌యూపీపీ నేతలు కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మూడేండ్ల నుంచి రాష్ట్రస్థాయి బెస్ట్ టీచర్ల అవార్డుల లిస్టులో లాంగ్వేజ్పండిట్లకు చోటు కల్పించడం లేదన్నారు. హైస్కూళ్లు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో సేవలందిస్తున్నా వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు.
జిల్లాస్థాయిల్లో అవార్డులు అందుకున్న చాలామంది టీచర్ల రాష్ట్రస్థాయి నామినేషన్లను పరిశీలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.