కాలేజీ ఎడ్యుకేషన్‌‌‌‌లో 56 మందికి బెస్ట్ టీచర్ అవార్డులు

కాలేజీ ఎడ్యుకేషన్‌‌‌‌లో 56 మందికి బెస్ట్ టీచర్ అవార్డులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాలేజీ విద్యాశాఖ పరిధిలో 2023 ఏడాదికిగాను 56 మంది ఉత్తమ టీచ ర్లుగా ఎంపికయ్యారు. వర్సిటీలు, అనుబంధ కాలేజీలు, లైబ్రేరియన్, పీడీ కేటగిరీల్లో సెలెక్ట్ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ లిస్ట్​ రిలీజ్ చేశారు. వారికి ఈ నెల 5న రవీంద్ర భారతిలో అవార్డులు అందించనున్నారు. ఓయూలో ప్రొఫెసర్ గణేశ్‌‌‌‌, హయవదన, మృణాళిని, శ్రీనివాసులు ఎంపిక కాగా, మహిళా వర్సిటీలో వరిజ, కాకతీయ వర్సిటీలో మనోహర్, శాతవాహన వర్సిటీలో 

హుమీర తస్నీమ్, తెలంగాణ వర్సిటీలో ఎం.యాదగిరి, పాలమూరు వర్సిటీలో ఎన్.చంద్రకిరణ్, ఎంజీయూలో అల్వాల రవి, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో జి.రవీందర్, హార్టికల్చర్ వర్సిటీలో సుచిత్ర, జేఎన్‌‌‌‌ఏఎఫ్‌‌‌‌ఏయూలో జి.మధుకర్, జేఎన్టీయూలో సత్యసావిత్రి, సీహెచ్​శిల్పాచక్ర, ఎం.అజిత, అగ్రికల్చర్ వర్సిటీలో ఎం.మల్లారెడ్డి, ఎల్.కృష్ణా, రామ్‌‌‌‌గోపాల్ వర్మ, ఆర్.గీతారెడ్డి, తెలుగు వర్సిటీలో కె.శ్రీనివాసచారి, వెటర్నరీ వర్సిటీలో ఉదయ్ కుమార్, నలినికుమారి, నల్సార్ లా వర్సిటీలో అరుణ బి వెంక ట్, నిమ్స్‌‌‌‌లో మెఘా ఎస్ యూపిన్, మహమ్మద్ ఇస్మాయిల్ నిజామి, ఉత్తమ లైబ్రరియన్‌‌‌‌గా కుమారస్వామి, ఉత్తమ పీడీగా ఫారుఖ్ కమల్ ఎంపికయ్యారు. 

ఇంటర్‌‌‌‌‌‌‌‌లో 11 మంది ఎంపిక..

ఇంటర్​ ఎడ్యుకేషన్‌‌‌‌లో 11 మందిని బెస్ట్ టీచర్లుగా ఎంపిక చేశారు. ప్రిన్సిపాల్ కేటగిరీలో పాపోలు ప్రభాకర్ (దేవరుప్పుల కాలేజీ, జనగామ), కె.వెంకటేశ్వర్లు (కడెం,  నిర్మల్), రమేశ్‌‌‌‌ లింగం (మల్దకల్, గద్వాల), కే శ్రీనివాస్ (మిరుదొడ్డి, సిద్దిపేట)ఉన్నారు. లెక్చరర్ల కేటగిరీలో ఎం.లింగం(మల్కాజిగిరి), రవికుమార్ (కూకట్​పల్లి), రాధిక (కాచిగూడ), జి.శ్రీలత (కందుకూర్, రంగారెడ్డి), వి.వెంకటరమణ (కరీంనగర్), టి.రాధాకిషన్​(మలక్ పేట), కె.రమణకుమారి (హయత్ నగర్​) ఉన్నారు.