స్మోకింగ్ ఎలా మానాలిప్రస్తుతం స్మోకింగ్ (Smoking) ఓ వ్యసనంగా మారిపోయింది.. చాలా మంది సరదాగా స్మోకింగ్ (Smoking) మొదలెట్టి, ఆ తర్వాత తమకు తెలియకుండానే వ్యసనపరులుగా మారుతున్నారు. స్మోకింగ్ (Smoking) బారిన పడి లక్షల మంది తమ ప్రాణాలకే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అయితే అలవాటుగా మారిన స్మోకింగ్ మానేయాలంటే వారి వల్ల కాక నానా తంటాలు పడుతున్నారు. స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, ఆస్తమా వంటి అనారోగ్యాలు దరి చేరుతాయి. మరి ధూమపానానికి కళ్లెం వేసి వదిలించుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి.
ధూమ పానం, మధ్య పానం ఆరోగ్యానికి హానికరం (Smoking) అన్న విషయం అందరికీ తెలుసు. కానీ వీటి నుంచి బయట పడాలంటే కొంచెం కష్టమే అని చెప్పవచ్చు. స్మోకింగ్ ని చాలా ఈజీగా మానేయవచ్చని అనుకుంటున్నారా.. అది మాటల వరకే పరిమితం అవుతుంది కానీ.. చేతల వరకు వెళ్లదు. స్మోకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసీ చాలా మంది మానలేకపోతున్నారు. స్మోకింగ్ చేయడం వల్ల.. బాడీలో నికోటిన్( Nicotin) విడుదల అవుతుంది. ఈ వ్యసనం నుంచి బయట పడాలంటే.. కొన్ని రకాల ఆహార పదార్థాలు బాగా హెల్ప్ చేస్తాయి. వీటిని తినడం వల్ల స్మోకింగ్ పై విరక్తిని కలిగిస్తుంది. దీంతో ధూమ పానంకు దూరంగా ఉండవచ్చు.
అల్లం:
అల్లం తీసుకోవడం వల్ల నికోటిన్ కోరికలను తగ్గిస్తుంది. స్మోకింగ్ చేసే వారికి అల్లాన్ని ఇవ్వడం వల్ల ఇది ప్రభావవంతంగా పని చేసి.. ధూమ పానంకు దూరంగా ఉంచుతుంది.
నారింజ
నారింజ మన శరీరంలో నుండి నికోటిన్ ను బయటకు పంపించడానికి హెల్ప్ చేస్తుంది. అంతే కాదు దీని వల్ల విటమిన్ సీ కూడా బాగా అందుతుంది. కాబట్టి ధూమ పానం చేసే వారు తరుచుగా తీసుకుంటే స్మోకింగ్ కు దూరంగా ఉండ వచ్చు.
క్యారెట్
క్యారెట్ లో ఉండే ఎ, బి, సి, కె వంటి విటమిన్లు శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ ని పెంచుతుంది. అలాగే స్మోకింగ్ వల్ల నరాలు, చర్మం దెబ్బతినకుండా ఉండేలా చేస్తుంది.
బ్రోకలీ
బ్రోకలీలో ఉండే విటమిన్ బీ5, సి లు శరీరంలో రోగ నిరోధక శక్తిని, జీవ క్రియను పెంచుతుంది. అలాగే శరీరం నుండి నికోటిన్ కూడా బయటకు పంపిస్తుంది. ముఖ్యంగా బ్రోకలీ పెద్ద ప్రేగు ద్వారా వచ్చే క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.
ఆకు కూరలు
ఆకు కూరల్లో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, పోషకాలు నికోటిన్ ఉప సంహరణ లక్షణానలను ఎదుర్కొనడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే నికోటిన్ బాడీ నుంచి బయటకు పంపుతుంది.
ఆపిల్
క్రమం తప్పకుండా ఆపిల్ తింటే.. స్మోకింగ్ అలవాటు దూరం అవుతుంది. యాపిల్ లో ఉండే ప్రాక్టిన్.. బ్లడ టాక్సిన్ కంటెంట్ ని తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇతర వ్యాధులకు కూడా దూరంగా ఉండవచ్చు.
దానిమ్మ
దానిమ్మ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు.. బాడీ నుంచి టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో బాగా సహకరిస్తుంది. అంతే కాకుండా స్మోకింగ్ చేయడం వల్ల తగ్గిన ఎర్ర రక్త కణాల సంఖ్యను కూడా మెరుగు పరుస్తుంది.