భలే ఐడియా : ఇలా చేస్తే.. కూలర్, ఏసీ లేకపోయినా.. మీ ఇల్లు చల్లగా ఉంటుంది..!

భలే ఐడియా : ఇలా చేస్తే.. కూలర్, ఏసీ లేకపోయినా.. మీ ఇల్లు చల్లగా ఉంటుంది..!

ఎండలు బాగా ముదిరిపోయాయి..బయటికెళ్లడం మాట అటుంచి, ఇంట్లో ఉండాలంటేనే పొయ్యిమీద కూర్చున్నట్లు ఉంటోంది.. ఏసీలు, కూలర్లు పెట్టుకున్నా అవన్నీ కరెంట్ తో నడిచేవి...ఇంటిని సహజంగా కూల్ చేస్తే ఇంటికి, ఒంటికి మంచిది.వేసవికాలంలో ఇంట్లో ఉన్నా ఉక్కపోస్తుంది. రాత్రిళ్లు సరిగా నిద్రపట్టదు... తడిగుడ్డతో ఫ్లోర్ తుడిచినా వెంటనే వేదిక్కుతుంది. బయట ఎండలో తిరిగొచ్చి, ఇంట్లో కాసేపు చల్లగా సేద తీరదాం అనుకుంటే... ఇల్లు కూడా వేడిగా ఉంటోంది. ఎండాకాలంలో ఇంటిని చల్లగా ఉంచుకోదానికి కొన్ని మార్గాలున్నాయి.

ఇలా ఉంచుకోవాలి

ఇంట్లో ఎక్కువ సామాన్లు ఉంటే వేసవిలో ఇబ్బంచే వాడని వస్తువులు తీసే కాలు ఖాళీగా ఉంచుకోవాలి. గాలి, వెలుతురు ఇంట్లోకి బాగా వచ్చేలా చూసుకోవాలి. ఇంటి పైన ఉండే వాటర్ ట్యాంక్లో నీళ్లు మధ్యాహ్నం పూట నీళ్లు లేకుండా. చూడాలి. అవి వేడెక్కడం వల్ల ఇల్లు కూడా వేడెక్కుతుంది.ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య సూర్యుడి ప్రతాపం ఎక్కువ. ఆ సమయంలో తలుపులు కిటికీలు వేయాలి. మళ్లీ రాత్రి వేళల్లో కిటికీలు తెరిచి ఉంచడం వల్ల చల్లటి గాలి లోపలకు వస్తుంది. 

వంట కూడా.ఉదయం, సాయంత్రం వేళల్లో చేసుకుంటే మంచిది. లేదంటే వంటగది వేడి ఇల్లంతా పాకుతుంది.వెండ ఎక్కువగా ఉన్నప్పుడు టీవీ, కంప్యూటర్, మొబైల్ లాంటి ఎలక్ట్రానికి వస్తువులు ఎంత తక్కువ వాడితే అంత మేలు. రైట్లు కూడా అవసరం అయితేనే వేసుకోవాలి. ఇంటి మధ్యలో టుబ్లో నీళు పోసి పెట్టుకోవాలి.

ఆ నీళ్లలో ఐస్ ముక్కలు. కొన్ని కర్పూరపు బిళ్లలు వేయడం వల్ల గదంతా చల్లగా ఉంటుంది. సువాసన కూడా వెదజల్లుతుంది. నిద్రపోయేముందు స్నానం చేస్తే వేసవి కాలంలో హాయిగా. నిద్రపడుతుంది. అలాగే నిద్రపోయే ముందు టవల్ లేదా బెడ్ షీట్ ను తడిపి పక్కన ఉంచుకోవడం వల్ల మంచిగా నిద్రపోవచ్చు.

మొక్కలు

ఇంట్లోనే కారు, ఇంటి చుట్టూ మొక్కలు పెంచడం వల్ల ఈ కాలంలో ఇల్లు చల్లగా ఉంటుంది. అపార్టుమెంట్లలో ఉండేవాళ్లు బాల్యనీలలోని కిటికీల దగ్గర కుండీల్లో మొక్కలు పెంచుకోవచ్చు. తీగలతో అల్లుకునే మొక్కలు పెంచడం వల్ల వేసవిలో మరింత చల్లదనం పొందొచ్చు. వాటికి పూలు పూస్తే మనసుకు అహ్లాదకరంగా ఉంటుంది. 

ఇంట్లో కూడా మనీప్లాంట్స్ ఉన్న కుండీలు పెట్టుకుంటే అవి వేడిని గ్రహించి, ఇంటినీ కూల్గా ఉంచుతాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది రూఫ్ గార్డెన్ పెంచుకుంటున్నారు. ఆకుకూరలు, కూరగాయలు సొంతంగా ఈ గార్డెన్లో పండించాలి. వేసవిలో అవి ఇంటిని చల్లగా ఉంచడానికి ఉపయోగపడతాయి. అలాగే ఇంటి చుట్టుపక్కల ఏమాత్రం స్థలం ఉన్నా మొక్కలు పెంచితే వేసవి తాపాన్ని మరింత తగ్గించుకోవచ్చు.

పరదాలు

ఎండాకాలంలో వారతో చేసిన చాపలు, వట్టివేళ్లతో చేసిన పరదాలు, గడ్డితో చేసిన మ్యాట్లు.. కిటికీల దగ్గర వేలాడ దీయాలి. వాటిని అప్పుడప్పుడు నీళ్లతో తడుపుతుండాలి. అవి వేడిగాలులు ఇంట్లోకి రాకుండా ఆవుతాయి.ఇంటి ఉష్ణోగ్రతను ఐదు డిగ్రీల వరకు తగ్గిస్తాయి. బయట మార్కెట్లో దొరికే పరదాలు కొనకపోయినా, ఇంట్లో ఉండే కాటన్ బెడ్ షీట్లను కూడా పరదాలుగా వాడుకోవచ్చు. ఇవి ఏసీలు, కూలర్ల కంటే ఇంటిని చల్లగా ఉంచుతాయి. వీటి వల్ల వచ్చే చల్లదనం ఆరోగ్యానికి కూడా మంచిది.

రంగులు

వేసవిలో పగటి ఎండకు టెర్రస్ బాగా వేడెక్కుతుంది. ఆ వేడి ఇంట్లోకి నేరుగా వస్తుంది. అందుకే ఎండాకాలంలో టెర్రస్ మీద కూల్ సిమెంటి వేయించాలి. దీనిలో క్రిస్టల్స్ కలిపిన పొడి, తెలుపు రంగు... కలిపిన మిశ్రమం ఉంటుంది.అవి సూర్యుడి నుంచి వచ్చే వేడిని లోపలకు రానీయవు. 

అలాగే లోపల పైకప్పుడు తెల్లరంగు లేదా సిలిపి చేయించడం వల్ల పైకప్పు వల్ల ఇంట్లోకి వచ్చే వేడిని డెబ్భైశాతం తగ్గించొచ్చు. గోడలకు కూడా లేతరంగులు వేయించడం వల్ల ఇల్లు కూటిగా ఉంటుంది. ఎందుకంటే, అది కూడా వేడిని తక్కువగా గ్రహిస్తాయి.ఈ కాలంలో ఇంట్లో వాడే బెడ్ షీట్లు.. సోఫా, దివాన్ కవర్లు.. లాంటివి కూడా లేతరంగుల్లో ఉండేలా చూసుకోవాలి.