ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్ ప్రకృతి అందాలకు, జీవ వైవిధ్యానికి కేరాఫ్‌గా నిలుస్తోంది. పచ్చని చెట్లు, వివిధ రకాల వన్యప్రాణులు, పక్షులు, సీతాకోకచిలుకలు టూరిస్టులకు కనువిందు చేస్తున్నాయి.
ఇటీవల వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఇందారం నగేశ్ కవ్వాల్‌లో పర్యటించారు. ఇక్కడి జీవవైవిధ్యాన్ని, జంతువులు, పక్షులను తన కెమెరాతో ఇలా క్లిక్‌మనిపించారు.
– మంచిర్యాల, వెలుగు