బెస్ట్ టూరిస్ట్ విలేజ్​లుగా.. పెంబర్తి, చంద్లాపూర్

బెస్ట్ టూరిస్ట్ విలేజ్​లుగా.. పెంబర్తి, చంద్లాపూర్
  • వరల్డ్ టూరిజం డే సందర్భంగా అవార్డుల అందజేత

న్యూఢిల్లీ, వెలుగు: జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామాల పురస్కారాలను తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన పెంబర్తి, సిద్దిపేట జిల్లాకు చెందిన చంద్లాపూర్​ దక్కించుకున్నాయి. బుధవారం వరల్డ్ టూరిజం డే సందర్బంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ సెక్రటరీ విద్యావతి ఈ అవార్డులను అందజేశారు. తెలంగాణకు దక్కిన అవార్డులను రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలాజా రామయ్యర్, సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, చంద్లాపూర్ గ్రామ సర్పంచ్ సూరగోని చంద్రకళ అందుకున్నారు.

కాగా, ఇత్తడి, కంచు లోహాలతో తయారు చేసే దేవతల విగ్రహాలు, కళా ఖండాలు, గృహ అలంకరణ వస్తువులతో పెంబర్తి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలాగే రంగనాయక స్వామి దేవాలయం, పరిసర ప్రాంతాలు గ్రామీణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందడంతో పాటు ఇక్కడి గొల్లభామ చీరలకున్న ప్రత్యేకత కారణంగా చంద్లాపూర్ ఉత్తమ గ్రామంగా నిలిచింది.