
ఐ ఫోన్ కొనాలని కలలు కనే వారికి గుడ్ న్యూస్. ఒక లక్ష రూపాయల ఐ ఫోన్ ను 20 వేల రూపాయలకు కొనే ఛాన్స్ అమెజాన్ కల్పిస్తోంది. iPhone 14 512GB కేవలం 20 వేల రూపాయలతో అమెజాన్ లో కొనే అవకాశం ఉంది. అయితే అందుకోసం కొన్ని ట్రిక్స్ పాటిస్తే ఈ వాల్యూ ఫోన్ మీ సొంతం. అదెలాగో తెలుసుకోండి.
Apple కంపెనీ 2024 లో iPhone16 లాంచ్ చేయడంతో అందరి అటెన్షన్ ఆ కొత్త మోడల్స్ పైకి వెళ్లింది. దీంతో ఐ ఫోన్ 14 ప్రైజ్ భారీగా పడిపోయింది. 256GB, 512GB iPhone 14 వేరియెంట్స్ చాలా తక్కువ ధరకు వస్తున్నాయి. సో ఓల్డ్ ఫోన్ నుంచి అప్ గ్రేడ్ కావడానికి ఇదే బెస్ట్ టైమ్ అనుకోవచ్చు.
అమెజాన్ భారీ డిస్కౌంట్..
iPhone 14 512GB మోడల్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఇస్తోంది. రూ.99,990 ఉన్న ఈ ఫోన్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.71,900 కు తగ్గింది. అంటే అమెజాన్ 28 శాతం డిస్కౌంట్ ఇస్తోంది.
రూ.20 వేలకు కొనటం ఎలా:
కొన్ని క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ఇన్ స్టంట్ డిస్కౌంట్ కింద రూ.2 వేలు డిస్కౌంట్ ఇస్తున్నాయి.
కొన్ని బ్యాంక్ ఆఫర్లు అప్లై అయితే మరో రూ.2157 సేవ్ అవుతాయి.
ఇక అమెజాన్ మాస్సివ్ ఎక్స్ చేంజ్ ఆఫర్ అందిస్తోంది. మంచి ఫోన్ అయితే ఎక్స్ చేంజ్ ఆఫర్ 53 వేల 200 రూపాయలు వస్తుంది.
ఇవన్నీ కలుపుకుంటే.. 18,700 రూపాయలకు ఈ ఫోన్ ను కొనేయొచ్చు. అయితే ఆ ఆఫర్స్ అప్లై చేసుకోవడంతో పాటు.. మన ఓల్డ్ ఫోన్ క్వాలిటీదై ఉండి రూ.53,200 వస్తే బంపర్ ఆఫర్ కొట్టినట్లే.
iPhone 14 ఫీచర్స్:
అల్యూమినియం ఫ్రేమ్ తో బ్యాక్ సైడ్ గ్లాస్ ప్యానెల్ ఉంటుంది.
వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది.
6-1 ఇంచుల సూపర్ రెటినా XDR OLED స్క్రీన్
సాఫ్ట్ వేర్: iOS 16 ఉంటుంది. iOS 18.3 కి అప్ గ్రేడ్ అయ్యే చాన్స్.
6GB RAM , 512GB స్టోరేజ్
12MP + 12MP డ్యుయెల్ రేర్ కెమెరా.. అదే విధంగా 12MP ఫ్రంట్ కెమెరా.